హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, స్టీల్‌ స్ట్రిప్స్‌ వీల్స్‌పై ఫోకస్‌

Stocks in the news today - Sakshi

వివిధ వార్తలకు అనుగుణంగా నేడు స్టాక్‌ మార్కెట్లు ప్రభావితమయ్యే షేర్లు

క్యూ4 ఫలితాలు: డీఎల్‌ఎఫ్‌, ఎన్‌ఐఐటీ, పీఐ ఇండస్ట్రీస్‌, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్ట్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, సఫారి ఇండస్ట్రీస్‌, పీఎన్‌బీ గ్లిట్‌, ఇగార్షి మోటార్స్‌, టీడీ పవర్‌ కంపెనీలు మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం ఫలితాలను గురువారం వెల్లడించనున్నాయి.

అదాని ఎంటర్‌ప్రైజెస్‌: అహ్మాదాబాద్‌, లక్నో, మంగళూరులోని మూడు ప్రైవేటు విమానాశ్రయాలను స్వాదీనం చేసుకోలేమని అదానీ గ్రూపు  ఎయిర్‌పోర్ట్‌ డెవలపర్‌  వెల్లడించింది. కోవిడ్‌-19 కారణంగా ఏర్పడిన అంతరాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అదాని ఎంటర్‌ ప్రైజెస్‌ తెలిపింది.

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌: 4 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా రూ.1,900 కోట్ల నిధులను హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ సమీకరించనుంది. ఇందుకోసం గురవారం బహిరంగ మార్కెట్లో బ్లాక్‌డీల్‌ను జరపనుంది. కాగా రూ.1,274 కోట్లకు సమానమైన 2.6 కోట్ల షేర్లను హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ బుధవారం విక్రయించింది.

టాటా మొటార్స్‌:టాటా గ్రూపు ఎదుర్కోంటున్న సమస్యలపై చర్చించేందుకు టాటా సన్స్‌ బోర్డు శుక్రవారం సమావేశం కానుంది.

 స్టీల్‌ స్ట్రిప్స్‌ వీల్స్‌: యూరప్‌, అమెరికా మార్కెట్లలో 8,000కుపైగా వీల్స్‌ను సరఫరా చేసేందుకు 3.35 లక్షల యూరోల ఆర్డరు పొందినట్లు ఈ కంపెనీ వెల్లడించింది.చెన్నై ట్రక్‌ వీల్‌ ప్లాంట్‌ నుంచి ఈ వీల్స్‌ను సరఫరా చేయనున్నట్లు రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో  కంపెనీ పేర్కొంది.

జేఎస్‌పీఎల్‌: మే నెలలో కన్సాలిడేటెడ్‌ క్రూడ్‌ స్టీల్‌ ఉత్పత్తి 9 శాతం తగ్గి 6.20 లక్షల టన్నులుగా నమోదైందని జేఎస్‌పీఎల్‌ తెలిపింది. గతేడాది ఇదే నెలలో ఉత్పత్తి 6.81లక్షల టన్నులుగా ఉంది.

టాటా స్టీల్‌: డెట్‌ ఇష్యూ ద్వారా రూ.400 కోట్ల నిధులను సమీకరించే ప్రతిపాదనకు టాటా స్టీల్‌ కమిటి ఆప్‌ డైరెక్టర్స్‌ ఆమోదం తెలిపారని ఈ కంపెనీ వెల్లడించింది. ప్రైటు ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన మఖ విలువ రూ.10 లక్షల కోట్లు కలిగిన 4,000 ఎన్‌సీడీలను ఇష్యూ చేసేందుకు కంపెనీ డైరెక్టర్లు ఆమోదించారు.

ఎన్‌సీఎల్‌:  కమర్షియల్‌ పేపర్స్‌ జారీ ద్వారా రూ.1,200 కోట్ల నిధులను సమీకరించినట్లు ఎన్‌సీఎల్‌ వెల్లడించింది. ముఖ విలువ రూ.5,00,000 కలిగిన 24 వేల కమర్షియల్‌ పేపర్ల్‌ను విక్రయించింది.

రెలీగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌: రూ.300 కోట్ల నిధులను సమీకరించినట్లు రెలీగేర్‌ వెల్లడించింది. దీంతో తమకున్న రుణాలను చెల్లించేస్తామని కంపెనీ వెల్లడించింది.

కోల్‌ ఇండియా: మే నెలలో ఉత్పత్తి 11.2 శాతం తగ్గి 41.43 మిలియన్‌ టన్నులుగా నమోదైనట్లు కోల్‌ ఇండియా వెల్లడించింది. కాగా గతేడాది ఇదే నెలలో ఉత్పత్తి 46.69 మిలియన్‌ టన్నులుగా ఉంది.

భారతీ ఇన్‌ఫ్రాటెల్‌:  తమ కంపెనీకి  చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా పూజ జైన్‌ను నియమిస్తున్నట్లు భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ వెల్లడించింది. జూన్‌ 4 నుంచి ఆమె బాధ్యతలు చేపట్టనున్నట్లు రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో ఈ కంపెనీ తెలిపింది.

గెయిల్‌: ఇండియాలో ట్రై జనరేషన్‌ ప్రాజెక్టులను చేపట్టేందుకు గెయిల్‌, ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్‌(ఈఈఎస్‌ఎల్‌)లు ఎంఓయూపై సంతకాలు చేసినట్లు ఈ కంపెనీ వెల్లడించింది.

Related Tweets
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top