లాభాల ప్రారంభం : ఊగిసలాటలో స్టాక్‌మార్కెట్లు

Sensex Rose Over 100 Points, turns  volatile - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ  స్టాక్‌ మార్కెట్లు  లాభాలతో ప్రారంభమయ్యాయి. మూడు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ  సానుకూలంగా ప్రారంభమైన   మార్కెట్‌  లాభాల సెంచరీ చేసింది.  ముఖ్యంగా నిఫ్టీ 11600 మార్క్‌ను అధిగమించింది. కానీ  గురువారం డెరివేటివ్స్‌ ముగింపు నేపథ్యంలో మార్కెట్లు మరోసారి ఊగిసలాట ధోరణి కనిపిస్తోంది.  ప్రస్తుతం 67పాయింట్లు పెరిగి 38,631వద్ద, నిఫ్టీ  23 పాయింట్లు లాభపడి 11,599 వద్ద ట్రేడవుతోంది. 

రియల్టీ, ఐటీ, బ్యాంక్‌ నిఫ్టీ 0.8-0.3 శాతం మధ్య పుంజుకోగా.. మెటల్‌ స్వల్పంగా నష్టపోతోంది.  ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌, ఇండస్‌ఇండ్, ఐవోసీ, ఐబీ హౌసింగ్‌, గెయిల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, ఆర్‌ఐఎల్‌ లాభాల్లోనూ,  హీరో మోటో, గ్రాసిమ్‌, టాటా మోటార్స్‌, వేదాంతా, మారుతీ, టాటా స్టీల్‌, జీ, అదానీ పోర్ట్స్‌, సిప్లా, సన్‌ ఫార్మా నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి.

మరోవైపు  డాలరు డిమాండ్‌ పెరగడంతో దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం బలహీనంగా ట్రేడ్‌ అవుతోంది.  డాలరు మారకంలో  రూపాయి  23 పైసలు నష్టపోయి 69.85 పైసల వద్ద ఉంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top