షావోమిలోకి శాంసంగ్‌ సేల్స్‌ అధినేత

Samsung India's Head of Sales Deepak Nakra joins Xiaomi - Sakshi

శాంసంగ్‌ ఇండియా సేల్స్‌ అధినేత దీపక్‌ నక్రా, దాని ప్రత్యర్థి కంపెనీ షావోమిలో జాయిన్‌ అయ్యారు. భారత్‌లో షావోమి ఆఫ్‌లైన్‌ మార్కెట్‌ను విస్తరించేందుకు దీపక్‌ ముఖ్య పాత్ర పోషించనున్నారు. దీపక్‌ నక్రా షావోమిలో చేరినట్టు ఈ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ మను కుమార్‌ జైన్‌ తన లింక్‌డిన్‌ పేజీలో తెలిపారు. ''షావోమి ఇండియా ఆఫ్‌లైన్‌ సేల్స్‌ను దీపక్‌ లీడ్‌ చేస్తున్నారని తెలుపడం చాలా ఆనందదాయకంగా ఉంది. పలు టాప్‌ హ్యాండ్‌సెట్‌ బ్రాండులు, టెలికాం ప్రొవైడర్లలో దీపక్‌ పనిచేశారు. సేల్స్‌ అండ్‌  మార్కెటింగ్‌లో ఈయనకు 20 ఏళ్ల అనుభవముంది'' అని మను కుమార్‌ జైన్‌ తెలిపారు. గత 9 నెలల క్రితమే తన ఆఫ్‌లైన్‌ ప్రయాణాన్ని ప్రారంభించామని, అతికొద్ది సమయంలోనే 20శాతం వృద్ధి చెందామని మను కుమార్‌ చెప్పారు. తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు దీపక్‌ సాయపడతారని నమ్మకముందని, రెండేళ్ల క్రితం తమ ఆన్‌లైన్‌ సేల్స్‌ అధినేతగా జాయిన్‌ అయిన రఘు, తమన్ని నెంబర్‌ 1 స్థానానికి చేర్చినట్టు పేర్కొన్నారు.

దేశీయ మార్కెట్‌ షేరులో షావోమి, శాంసంగ్‌కు దగ్గర్లో ఉంది. 2017 మూడో త్రైమాసికంలో శాంసంగ్‌ 23 శాతం మార్కెట్‌ షేరుతో టాప్‌లో ఉండగా... 22 శాతం మార్కెట్‌ షేరుతో షావోమి రెండో స్థానంలో నిలిచింది. 2012 నుంచి ఇదే తొలిసారి. రెండు కంపెనీలు దగ్గర్లో మార్కెట్‌ షేరును నమోదుచేయడం. ఆన్‌లైన్‌ సెగ్మెంట్‌లో షావోమి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌ సెగ్మెంట్‌పైనా దృష్టిసారించింది. ఆఫ్‌లైన్‌ మార్కెట్‌ను కూడా తన సొంతం చేసుకునేందుకు కఠినతరమైన ప్లాన్లను కూడా రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా 100 ఎక్స్‌క్లూజివ్‌ రిటైల్‌ స్టోర్లను లాంచ్‌ చేసేందుకు కంపెనీ ప్లాన్‌ చేస్తోంది. ఎంఐ హోమ్స్‌ పేరుతో వచ్చే రెండేళ్లలో వీటిని లాంచ్‌ చేయనుంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top