భారత్లోకి గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ | Samsung Galaxy S7 price starts at Rs 48900, with free Gear VR for pre-bookings | Sakshi
Sakshi News home page

భారత్లోకి గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్

Mar 9 2016 12:25 AM | Updated on Sep 3 2017 7:16 PM

భారత్లోకి గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్

భారత్లోకి గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్

దక్షిణ కొరియా మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ తాజాగా గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్స్‌ను మంగళవారం భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది.

విడుదల చేసిన శాంసంగ్  ధరలు రూ.48,900; రూ.56,900
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ తాజాగా గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్స్‌ను మంగళవారం భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు 32 జీబీ, 64 జీబీ అనే రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నాయి. ఇవి వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్స్‌ను శాంసంగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రి-బుకింగ్ చేసుకోవచ్చు. మార్చి 8-18 మధ్యకాలంలో ప్రి-బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ వర్చువల్ రియాలిటీ(వీఆర్)ను ఉచితం గా అందిస్తోంది. కాగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ ఓపెన్ మార్కెట్‌లో మార్చి 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

 గెలాక్సీ ఎస్7: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.1 అంగుళాల తెర, ఆక్టాకోర్ ప్రాసెసర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్, 32 జీబీ మెమరీ, 4జీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ.48,900గా ఉంది.

 గెలాక్సీ ఎస్7 ఎడ్జ్: 5.5 అంగుళాల తెర, ఆక్టాకోర్ ప్రాసెసర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4 జీబీ ర్యామ్, 4జీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్, 32 జీబీ మెమరీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 3,600 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ.56,900.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement