
పాతాళానికి రూపాయి..!
డీమానిటైజేషన్ తదితర పరిణామాల నేపథ్యంలో రూపారుు పతనం కొనసాగుతోంది.
• రికార్డు కనిష్టానికి పతనం..
• డాలర్‌తో పోలిస్తే 68.86కి క్షీణత
• 70 స్థారుుకి పడిపోవచ్చని అంచనా
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ తదితర పరిణామాల నేపథ్యంలో రూపారుు పతనం కొనసాగుతోంది. గురువారం ఇంట్రా డేలో డాలర్‌తో పోలిస్తే రూపారుు మారకం విలువ 68.86 స్థారుుకి పడిపోరుుంది. ఇప్పటిదాకా 2013 ఆగస్టు 28 ఇంట్రాడేలో నమోదైన 68.85 స్థాయే ఆల్‌టైమ్ కనిష్టంగా ఉంది. ఆ రోజున దేశీ కరెన్సీ 68.80 వద్ద ముగిసింది. ఇటు పెద్ద నోట్ల రద్దు, అటు సమీప భవిష్యత్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు తది తర పరిణామాలు రూపారుు పతనానికి దారి తీస్తున్నాయని పరిశీలకులు పేర్కొన్నారు. ఇదే ధోరణి కొనసాగితే మరికొద్ది కాలంలో 70 స్థారుుకి కూడా పడిపోయే అవకాశముందని వ్యాఖ్యానించారు.
గురువారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 68.56తో పోలిస్తే బలహీనంగా 68.74 వద్ద ప్రారంభమైన రూపారుు ట్రేడింగ్ ఒక దశలో ఆల్‌టైమ్ కనిష్టం 68.86కి పడిపోరుుంది. చివరికి కొంత కోలుకుని 39 నెలల కనిష్ట క్లోజింగ్ స్థారుు 68.73 వద్ద ముగిసింది. రూపారుు పతనానికి అడ్డుకట్ట వేసేందుకు ఒక దశలో ఆర్‌బీఐ జోక్యం చేసుకుందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నారుు. దాదాపు బిలియన్ డాలర్లను ఫారెక్స్ మార్కెట్లో ఆర్‌బీఐ విక్రరుుంచినట్లు మార్కెట్ వర్గాలు తెలిపారుు.
కరెన్సీ కదలికల్ని గమనిస్తున్నాం: ఆర్థిక శాఖ గడిచిన అరుుదు ట్రేడింగ్ రోజుల్లో రూపారుు విలువ ఏకంగా 91 పైసల మేర (సుమారు 1.34 శాతం) పతనమైన నేపథ్యంలో కరెన్సీ కదలికలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపారుు. తగు సమయంలో ఆర్‌బీఐ తగు నిర్ణయం తీసుకోగలదని పేర్కొన్నారుు. డాలర్‌తో పోలిస్తే రూపారుు విలువ 69 కన్నా దిగువనే కొనసాగినంత వరకూ ఆర్‌బీఐ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోబోదని వివరించారుు. ఈ నెలలో రూపారుు విలువ దాదాపు 3 శాతం మేర క్షీణించింది. 14 నెలల కాలంలో ఇది అత్యంత భారీ పతనం. మరోవైపు, రూపారుు క్షీణత మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థ ఎడెల్‌వీజ్ ఒక అధ్యయన నివేదికలో పేర్కొంది. వ్యవస్థలో ద్రవ్య లభ్యత కొంత మెరుగుపడితే పరిస్థితి చక్కబడగలదని తెలిపింది.