కోలుకున్న సెన్సెక్స్, రూపాయి! | Rupee and Sensex recovered from huge loses | Sakshi
Sakshi News home page

భారీ నష్టాల నుంచి కోలుకున్న సెన్సెక్స్, రూపాయి!

Aug 20 2013 4:30 PM | Updated on Sep 1 2017 9:56 PM

కోలుకున్న సెన్సెక్స్, రూపాయి!

కోలుకున్న సెన్సెక్స్, రూపాయి!

భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల నుంచి కోలుకుని స్వల్ప నష్టాలతో ముగిసాయి.

భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల నుంచి కోలుకుని స్వల్ప నష్టాలతో ముగిసాయి. డాలర్ కు వ్యతిరేకంగా రూపాయి భారీగా క్షీణించి 64 రూపాయలకు చేరుకోవడంతో ఓ దశలో ఆరంభంలో ప్రధాన సూచీలు సెన్సెక్స్ 17970 పాయింట్ల, నిఫ్టీ 5306 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. అయితే చివరికి సెన్సెక్స్ 61 పాయింట్ల నష్టంతో 18246 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల నష్టంతో 5401 పాయింట్ల వద్ద ముగిసాయి. 
 
గత కొద్దికాలంగా ఏకధాటిగా క్షీణిస్తున్న రూపాయి మంగళవారం ఆరంభంలోనే 98 పైసలు పతనమై 64.11 రూపాయల చారిత్రాత్మక కనిష్టాన్ని చేరుకుంది. 
 
నేటి మార్కెట్ లో సూచీ అధారిత కంపెనీ షేర్లలో సెసా గోవా అత్యధికంగా 16 శాతం లాభపడగా, జయప్రకాశ్ అసోసియేట్స్ 5 శాతం, టాటా స్టీల్, కెయిర్న్ 4 శాతం, బీపీసీఎల్ 3 శాతానికి పైగా లాభపడ్డాయి. 
 
టాటా మోటార్స్ 5 శాతం, ఏసీసీ 4.5 శాతం, హెచ్ సీఎల్ టెక్ 3.5, సన్ ఫార్మా, టీసీఎస్ లు 2.5 శాతానికి పైగా నష్టపోయాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement