2జీ ఆపరేషన్స్‌ క్లోజ్‌: ఆర్‌కామ్‌ ఢమాల్‌

RCom shares fall 5% as the company plans to shut down 2G operations

ముంబై : అప్పులతో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, తన 2జీ ఆపరేషన్స్‌కు గుడ్‌బై చెబుతున్న క్రమంలో ఈ కంపెనీ షేర్లు అతలాకుతలమవుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఆర్‌కామ్‌ షేర్లు కుప్పకూలాయి. నేటి ట్రేడింగ్‌లో సుమారు 5 శాతం మేర ఆర్‌కామ్‌ షేర్లు కిందకి పడిపోయాయి. ప్రారంభంలోనే బలహీనంగా ఎంట్రీ ఇచ్చిన ఆర్‌కామ్‌ షేర్లు, బీఎస్‌ఈ ఎక్స్చేంజ్‌లో మరింత కిందకి దిగజారి 52 వారాల కనిష్ట స్థాయిల్లో 4.55 శాతం నష్టంలో రూ.15.70 వద్ద ట్రేడవుతున్నాయి. అంతేకాక ఎన్‌ఎస్‌ఈలో 4.86 శాతం నష్టంలో ఏడాది కనిష్ట స్థాయిలను నమోదుచేస్తున్నాయి. నిన్నటి ట్రేడింగ్‌లో కూడా ఆర్‌కామ్‌ షేర్లు 3 శాతం నష్టాలను గడించాయి. 

నవంబర్‌ 30 వరకు తమ టెలిఫోనీ వ్యాపారలను మూసివేయాలని ఆర్‌కామ్‌ ప్లాన్స్‌ వేస్తోంది. కేవలం 4జీ ఇంటర్నెట్‌ సర్వీసులపైనే ఇది దృష్టిసారించనుంది. దీంతో వేల మంది ఉద్యోగులు కూడా రోడ్డున పడబోతున్నారు. 1200 మంది ఉద్యోగులను తీసివేయాలని ఆర్‌కామ్‌ చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యాపారాల మూత 5000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుందని హెడ్‌హంటర్స్‌ ఇండియా అంచనావేస్తోంది. తమ నవంబర్‌ వేతనాలను నెలన్నర ఆలస్యం చేస్తున్నట్టు ఉద్యోగులు కూడా తెలిపారు. జనవరి 15న ఫుల్‌ సెటిల్‌మెంట్‌తో ఉద్యోగులకు వేతనాలను ఇవ్వనున్నట్టు రిలయన్స్‌ టెలికాం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గుర్దీప్‌ సింగ్‌ తెలిపారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top