స్మార్ట్‌ఫోన్లపై బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన పేటీఎం

Paytm Gives 15% Cashback On Smartphones - Sakshi

స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటున్నారు.. కానీ మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే. డిజిటల్‌ పేమెంట్‌ దిగ్గజం పేటీఎం మాల్‌, ఒప్పో, మోటరోలా, హనర్‌ వంటి స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌లపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్లపై ఫ్లాట్‌ 15 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేయనున్నట్టు తెలిపింది. 

ఒప్పో ఎఫ్‌ 5 యూత్‌
ఈ ఏడాది విడుదలైన ‘ఒప్పో ఎఫ్‌ 5 యూత్‌’ స్మార్ట్‌ఫోన్‌పై పేటీఎం 15 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఇదే కాక కంపెనీ అదనంగా మరో 5,499 రూపాయల డిస్కౌంట్‌ను ప్రకటించింది. అంటే మొత్తంగా కలుపుకుని చివరకు ‘ఒప్పో ఎఫ్‌ యూత్‌’ 14,500 రూపాయలకే వస్తుంది. క్యాష్‌బ్యాక్‌ పొందాలనుకుంటే పేమెంట్‌ చేసేటప్పుడు వినియోగదారుడు ‘ఎమ్‌ఓబీ15’ అనే ప్రోమో కోడ్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుందని పేటీఎం తెలిపింది. క్యాష్‌బ్యాక్‌ ఎమౌంట్‌ 24 గంటల్లో పేటీఎం వాలెట్‌కు యాడ్‌ అవుతుందని తెలిపారు.

ఒప్పో ఎఫ్‌7 డైమండ్‌ బ్లాక్‌ ఎడిషన్‌
ఈ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుత విలువ 27, 990 రూపాయలు. కంపెనీ 4 వేల రూపాయల ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ప్రకటించిన తర్వాత ఈ ఫోన్‌ ఖరీదు 23,990 రూపాయలకు తగ్గింది. ఇదే కాక ప్రోమో కోడ్‌ ‘ఎమ్‌ఓబీ15’ను అప్లై చేస్తే అదనంగా మరో 15 శాతం డిస్కౌంట్‌ లభిస్తుందని పేటీఎం తెలిపింది.

మోటో జీ6
ఈ మధ్యే లాంచ్‌ అయిన మోటో జీ6 స్మార్ట్‌ఫోన్‌ ఖరీదు 19,999 రూపాయలు. కానీ ఇప్పటికే కంపెనీ ప్రకటించిన డిస్కౌంట్‌తో ఇది 16,998 రూపాయలకు లభిస్తుంది. ఇదే కాక పేటీఎం అదనంగా మరో 15 శాతం డిస్కౌంట్‌ ఇస్తుండటంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర మరో 2,210 రూపాయలు తగ్గుతుంది. పేటీఎం డిస్కౌంట్‌ అప్లై అవ్వాలంటే పేమెంట్‌ చేసే సమయంలో ప్రోమో కోడ్‌ ‘ఎమ్‌ఓబీ15’ను నమోదు చేయలని కంపెనీ చెప్పింది.

మోటో జీ 6 ప్లే
మోటో జీ 6 తో పాటు జీ 6 ప్లేపై కూడా పేటీఎం 15 శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పటికే కంపెనీ ప్రకటించిన 1,744 రూపాయల డిస్కౌంట్‌ తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌ 12,255 రూపాయలకు వస్తుంది. ఇదే కాక పేటీఎం ప్రకటించిన 15 శాతం క్యాష్‌బ్యాక్‌తో అదనంగా మరో 1,593 రూపాయలు తగ్గుతుంది. 15 శాతం క్యాష్‌బ్యాక్‌ అప్లై అవ్వాలంటే పేమెంట్‌ చేసే సమయంలో ప్రోమో కోడ్‌ ‘ఎమ్‌ఓబీ15’ను ఎంటర్‌ చేయాలి.

హనర్‌ 9 లైట్‌
హనర్‌ కంపెనీ నుంచి ఈ ఏడాది వచ్చిన తొలి స్మార్ట్‌ ఫోన్‌ హనర్‌ 9 లైట్‌. ఈ ఏడాది లాంచ్‌ అయిన హనర్‌ 9 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ ప్రకటించిన 2,000 రూపాయల డిస్కౌంట్‌తో పాటు అదనంగా పేటీఎం ప్రకటించిన 15 శాతం డిస్కౌంట్‌ను కలుపుకుని ఈ ఫోన్‌ ఫైనల్‌ ప్రైస్‌ 14,998 రూపాయలకు లభిస్తుంది.

హనర్‌ 7 ఎక్స్‌
గతేడాది డిసెంబర్‌లో విడుదలైన బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ హనర్‌ 7 ఎక్స్‌ పై పేటీఎం మాల్‌ ప్రకటించిన 15 శాతం క్యాష్‌బ్యాక్‌ వల్ల 2,516 రూపాయలు తగ్గి చివరకూ 16, 770 రూపాయలకు అందుబాటులో ఉందని పేటీఎం ప్రకటించింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top