
ఎస్‌బీఐ కార్డ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో కలసి ఒక కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డును విడుదల చేసింది. ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి, ఎస్‌బీఐ ఎండీ అశ్విని కుమార్ తివారీ సమక్షంలో ‘ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్’ను ఆవిష్కరించినట్టు ఎస్‌బీఐ కార్డ్ ప్రకటించింది.
షాపింగ్‌పై క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలతో దీన్ని రూపొందించినట్టు తెలిపింది. ఈ కార్డుతో మింత్రాపై కొనుగోళ్లు చేస్తే 7.5 శాతం, ఫ్లిప్‌కార్ట్, షాప్సి, క్లియర్‌ట్రిప్‌పై చేసే కొనుగోళ్లపై 5 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చని ఎస్‌బీఐ కార్డ్ తెలిపింది.
రివార్డులను తిరిగి ఫ్లిప్‌కార్ట్‌పై కొనుగోళ్లకు, ట్రావెల్ బుకింగ్‌లకు వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ యాప్, ఎస్‌బీఐ కార్డ్ డాట్ కామ్ నుంచి ఈ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అదనపు ప్రయోజనాలు
రూ.1,250 విలువైన వెల్కమ్ బెనిఫిట్స్ (ఇ-గిఫ్ట్ కార్డులు, Cleartrip వౌచర్లు).రూ.3.5 లక్షల వార్షిక ఖర్చుతో రిన్యూవల్ ఫీజు రివర్సల్.
1% ఫ్యూయల్ సర్‌చార్జ్ మాఫీ (రూ.400 వరకు/స్టేట్‌మెంట్ సైకిల్).