భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రెండు మూడేళ్లలో 8 శాతం వృద్ధి బాట పడుతుందని నీతీ ఆయోగ్ భావిస్తోంది.
మూడేళ్ల చర్యల ముసాయిదాలో నీతి అయోగ్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రెండు మూడేళ్లలో 8 శాతం వృద్ధి బాట పడుతుందని నీతీ ఆయోగ్ భావిస్తోంది. ఈ పరిస్థితి వచ్చే దశాబ్ద కాలంలో దేశంలో పేదరిక నిర్మూలనకు దోహదపడుతుందని కూడా నీతీ ఆయోగ్ విశ్లేషించింది. కొత్తగా ఆవిష్కరించిన తన మొట్టమొదటి మూడేళ్ల చర్యల ముసాయిదా అజెండాలో నీతీ ఆయోగ్ ఈ కీలక అంశాలను పొందుపరిచింది. ఆదివారం నాడు తన 208 పేజీల అజెండాను ముఖ్యమంత్రులకు సర్క్యు యలేట్ చేసింది. పన్ను, వ్యవసాయం, పాలనా పరమైన అంశాలకు సంబంధించి సంస్కరణలను వేగవంతం చేయాలని ముసాయిదాలో సూచించింది.