రూ.2 లక్షల కోట్లకు మిథనాల్‌ వాటా | Sakshi
Sakshi News home page

రూ.2 లక్షల కోట్లకు మిథనాల్‌ వాటా

Published Sat, Dec 22 2018 1:26 AM

Mithanal has a share of Rs 2 lakh crore - Sakshi

న్యూఢిల్లీ: మిథనాల్‌ వినియోగం రూ.11,000 కోట్ల స్థాయి నుంచి వచ్చే ఐదేళ్ల కాలంలో రూ.2 లక్షల కోట్ల స్థాయికి తీసుకెళ్లేందుకు భారత్‌ కృషి చేస్తుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. తద్వారా పర్యావరణ అనుకూల ఇంధన వినియోగాన్ని పెంచడంతో పాటు, చమురు దిగుమతుల బిల్లును తగ్గించుకుంటామని స్పష్టంచేశారు. ఢిల్లీలో శుక్రవారం ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రదర్శనను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా నుంచి నాసిరకం విడిభాగాలను దిగుమతి చేసుకోవడం ద్వారా నాణ్యతలో రాజీ పడొద్దంటూ తయారీదారులకు సూచించారు. నాణ్యత, ప్రమాణాలకు ప్రాధాన్యమివ్వాలని, లేదంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు.

‘‘భారత్‌ ప్రస్తుతం విద్యుత్‌ మిగులు దేశం. సమృద్ధిగా బొగ్గు, సౌర విద్యుత్‌ వనరులు ఉన్నాయి. తక్కువ ఖర్చులో దిగుమతులకు ప్రత్యామ్నాయాలు తేవాలని, కాలుష్యం లేని రవాణా విధానాలైన ఎలక్ట్రిక్‌ వాహనాలు తదితరాలను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ప్రయత్నం’’ అని మంత్రి వివరించారు. ఇజ్రాయెల్‌లో మిథనాల్‌ లీటర్‌ రూ.12, చైనాలో రూ.16 ఉంటే మన దగ్గర రూ.22 ఉందని, పెట్రోల్, డీజిల్‌ కంటే చౌక అని చెప్పారాయన. దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల విషయంలో గత ఏడాది కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని, ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షాలు దేశంలోని చాలా ప్రాంతాలను చేరాయని తెలియజేశారు. చమురు దిగుమతుల రూపంలో పెద్ద ఎత్తున తరలిపోతున్న విదేశీ మారకానికి చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మిథనాల్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రణాళికల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఐదు టాస్క్‌ ఫోర్స్‌లను ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా ప్రకటించారు.  

ఈ రిక్షాల ఆవిష్కరణ..
∙ఈ కార్యక్రమంలోనే కెటో మోటార్స్, ౖMðటోగ్రీన్‌ టెక్నాలజీస్‌ కలసి ఎలక్ట్రిక్‌ ఆటో ‘ౖMðటో’ను ఆవిష్కరించాయి. వచ్చే రెండేళ్లలో భారత్‌లో 10 మిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చే యడం ద్వారా, ఇతర దేశాలకు ఎగుమతి కేం ద్రంగా భారత్‌ను చేసుకుంటామని కైటో గ్రీన్‌ టెక్నాలజీస్‌ ఎండీ గ్రేసన్‌ రిచర్డ్స్‌ చెప్పారు.  రెండేళ్లలో తాము భారత్‌లో 5 మిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేస్తామని, అధిక వేగంతో కూడిన ఎలక్ట్రిక్‌ ఆటో ‘సూపర్‌ కింగ్‌’లను 20,000 యూనిట్లను తయారు చేస్తామని గోయంకా ఎలక్ట్రిక్స్‌ సీఈవో జాఫర్‌ ఇక్బాల్‌ ఈ సందర్భంగా చెప్పారు.  సార్తి బ్రాండ్‌ ఈ రిక్షా ‘షావక్‌’ను ఇదే కార్యక్రమంలో ఆవిష్కరించింది. 1,000 యూనిట్లను తయారు చేసే ప్రణాళికతో ఉన్నట్టు కంపెనీ ఎండీ సార్తి తెలిపారు.
 
ఏడాదిలోగా దేశంలోనేలిథియం బ్యాటరీల తయారీ 
వచ్చే ఏడాది కాలంలో దేశంలో లిథియం అయాన్‌ బ్యాటరీలను తయారు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి అనంత్‌గీతే తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బీహెచ్‌ఈఎల్, అమెరికా సంస్థ మధ్య జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నట్టు చెప్పా రు. ‘‘ప్రస్తుతం లిథియం అయాన్‌ బ్యాటరీలను 100% దిగుమతి చేసుకుంటున్నాం. వీటిని ఏడాదిలోగా దేశంలోనే తయారు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి’’ అని చెప్పారు. ఎలక్ట్రిక్‌ ఆటో కైటోను మంత్రి ఆవిష్కరించారు. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఉపయోగించే విడిభాగాల దిగుమతులపై కస్టమ్స్‌ డ్యూటీని తగ్గించాలని ఆర్థిక శాఖను కోరామని, దీనిపై ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వినియోగించే లిథియం అయాన్‌ బ్యాటరీలను  దాదాపు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న విషయం గమనార్హం. 

Advertisement

తప్పక చదవండి

Advertisement