9% లాభంతో లిస్టైన  మెట్రోపొలిస్‌  హెల్త్‌కేర్‌

Metropolis Healthcare closes 9% higher at Rs 960 from issue price - Sakshi

న్యూఢిల్లీ: డయాగ్నస్టిక్‌ చెయిన్‌ మెట్రోపొలిస్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ షేర్‌ లిస్టింగ్‌లో ఓ మోస్తరు లాభాలను సాధించింది. బీఎస్‌ఈలో ఈ షేర్‌ ఇష్యూ ధర రూ.880తో పోల్చితే 9 శాతం లాభంతో రూ.960 వల్ల లిస్టయింది. ఇంట్రాడేలో 12 శాతం లాభంతో రూ.981 వద్ద గరిష్ట స్థాయిని తాకింది.చివరకు 9 శాతం లాభంతో రూ.960 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 6.13 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 72 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

సోమవారం మార్కెట్‌ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.4,815 కోట్లుగా ఉంది. ఇటీవలే రూ.887–880 ప్రైస్‌బాండ్‌తో ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ రూ.1,200  కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓ 6 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది.  మెట్రోపొలిస్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ భారత్‌లో మూడవ అతిపెద్ద లిస్టెడ్‌ డయాగ్నస్టిక్‌ చెయిన్‌ కావడం గమనార్హం.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top