లిక్కర్‌ షేర్లకు మంచి కిక్కు.. | Liquor shares rally as United Spirits posts strong profit | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ షేర్లకు మంచి కిక్కు..

Oct 27 2017 1:23 PM | Updated on Oct 27 2017 1:23 PM

Liquor shares rally as United Spirits posts strong profit

లిక్కర్‌ కంపెనీ షేర్లు నేటి ట్రేడింగ్‌లో మంచి కిక్కు అందిస్తున్నాయి. యునిటెడ్‌ స్పిరిట్స్‌ ఏకంగా ఇంట్రాడే ట్రేడ్‌లో 16 శాతం మేర ర్యాలీ జరుపుతోంది. కంపెనీ భారీ లాభాలను నమోదుచేయడంతో, ఈ మేర దూసుకెళ్తున్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో యునిటెడ్‌ స్పిరిట్స్‌ విక్రయాల్లో పడిపోయినప్పటికీ, లాభాల్లో మాత్రం భారీగా 84 శాతం జంప్‌ చేసి, రూ.153 కోట్లను నమోదుచేసింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో కంపెనీ లాభాలు రూ.83 కోట్లున్నాయి. కంపెనీ ఈబీఐటీడీఏలు 57 శాతం పెరిగి రూ.318 కోట్లను రికార్డు చేశాయి. 

స్థూల మార్జిన్లు పెరగడం, తక్కువ స్టాఫ్‌ వ్యయాలు ఉండటం, మార్కెటింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్లు పెరగడం వంటి కంపెనీకి సహకరించాయి. హైవేలపై లిక్కర్‌ అమ్మకాలు బ్యాన్‌ చేయడంతో, నికర అమ్మకాలు యునిటెడ్‌ స్పిరిట్స్‌వి కాస్త తగ్గాయి. అయినప్పటికీ కంపెనీ బలమైన లాభాలనే నమోదుచేసింది. ఈ జోరుతో యునిటెడ్‌ స్పిరిట్స్‌ షేర్లతో పాటు ఇతర లిక్కర్‌ కంపెనీల షేర్లు కూడా లాభాలు పండిస్తున్నాయి. జీఎం బెవరీస్‌, పయనీర్ డిస్టిలరీస్ కంపెనీలు 10 శాతం మేర లాభపడ్డాయి. మిగతా లిక్కర్‌ కంపెనీలు కూడా నేటి ట్రేడింగ్‌లో జోష్‌గా దూసుకుపోతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement