ఎల్‌జీ వీ30 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర తగ్గింది

LG V30+ Smartphone Gets A Price Cut In India - Sakshi

న్యూఢిల్లీ : ఎల్‌జీ గతేడాది డిసెంబర్‌లో లాంచ్‌ చేసిన ఎల్‌జీ వీ30 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరను తగ్గించింది. లాంచింగ్‌ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.44,990గా ఉంటే, ధర తగ్గింపు అనంతరం రూ.41,990కు వచ్చి చేరింది. అంటే 3000 రూపాయల మేర దీని ధర తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌లోనే అందుబాటులో ఉంది. కంపెనీ తగ్గించిన ధర మాత్రమే కాక, ఈ-కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ కూడా ఈ ఫోన్‌ కొనుగోలుపై కస్టమర్లకు మరికొన్ని ఆఫర్లను ప్రకటించింది. రూ.8500 ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను, నెలకు రూ.1,996 ఈఎంఐను అమెజాన్‌ ఆఫర్‌ చేస్తోంది. వీటితో పాటు ఈఎంఐ లావాదేవీలపై అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది.

ఎల్‌జీ వీ30 ప్లస్ ఫీచర్లు...
6 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే
1440x2880  పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
 కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
 ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
 హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
16 మెగాపిక్సెల్‌, 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు
 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
 ఫింగర్‌ప్రింట్ సెన్సార్
 ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్
4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top