ఆ ఫోన్‌కు వెనుక 3, ముందు 2 కెమెరాలు | LG Officially Reveals V40 ThinQ With Five Camera Setup | Sakshi
Sakshi News home page

ఐదు కెమెరాలతో ఎల్‌జీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌

Sep 29 2018 1:37 PM | Updated on Sep 29 2018 1:38 PM

LG Officially Reveals V40 ThinQ With Five Camera Setup - Sakshi

సియోల్‌ : స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను ఆకట్టుకునేందుకు దక్షిణ కొరియాకు చెందిన మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్‌జీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్‌ 3న మార్కెట్‌లోకి విడుదల చేయబోతుంది. ఆ స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌కు సంబంధించిన ఈవెంట్‌ ఇన్విటేషన్లను మీడియాకు  కూడా పంపిస్తోంది. ఎల్‌జీ వీ40 థిన్‌క్యూగా పేర్కొంది. ఈ డివైజ్‌కు చెందిన వీడియోను తన అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌లో పొందుపరిచింది. 30 సెకన్లలో ఈ లాంచ్‌ వీడియో థీమ్‌, కెమెరా సెటప్‌. అంటే ఆ వీడియోలో ఎల్‌జీ వీ40 థిన్‌క్యూ కెమెరా సెటప్‌ను రివీల్‌ చేసింది. రూమర్లన్నంటిన్నీ ధృవీకరిస్తూ.. మొత్తం ఐదు కెమెరా లెన్సస్‌ను ఇది కలిగి ఉంది. వెనుక వైపు మూడు, ముందు వైపు రెండు కెమెరాలున్నాయి. 

ప్రైమరీ కెమెరా ఎల్‌జీ ట్రేడ్‌మార్క్‌ ఫీచర్‌ మెయిన్‌ లెన్స్‌తో వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను కలిగి ఉంది. పోర్ట్రెయిట్ మోడ్‌కు ఇటీవల డిమాండ్‌ బాగా పెరుగుతుండటంతో, ఎల్‌జీ మూడో లెన్స్‌ను ఈ విధంగా రూపొందించింది. ఈ ఫోన్‌కు సంబంధించిన మిగతా వివరాలు అక్టోబర్‌ 3న రివీల్‌ కానున్నాయి. అమెరికాలోని న్యూయార్క్‌లో దీని లాంచింగ్‌ ఈవెంట్‌ జరగనుంది. వెంటనే అక్టోబర్‌ 4న రెండో లాంచ్‌ ఈవెంట్‌ను దక్షిణ కొరియా సియోల్‌లో నిర్వహించబోతుంది. వెంటవెంటనే ఎల్‌జీ రెండు లాంచింగ్‌ ఈవెంట్లతో మార్కెట్లను ధూంధాం పరచనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement