ఐఫోన్‌ ఎక్స్‌ కంటే ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ ఇదే!

LG New Phone Is More Expensive Than iPhone X - Sakshi

న్యూఢిల్లీ : ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో అత్యంత ఖరీదైన ఫోన్‌ ఏదీ అంటే. ఠక్కున ఐఫోన్‌ ఎక్స్‌ అని చెప్పేస్తాం. లక్ష రూపాయలకు పైగా ధరతో భారత్‌లో అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా వినియోగదారుల ముందుకు వచ్చింది. అయితే తాజాగా ఐఫోన్‌ ఎక్స్‌ ధరను మించి, దాని కంటే ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది. దక్షిణ కొరియా టెక్‌ దిగ్గజం ఎల్‌జీ తన సిగ్నేచర్‌ సిరీస్‌లో లేటెస్ట్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. గతేడాది లాంచ్‌ చేసిన ఎల్‌జీ సిగ్నేచర్‌ ఎడిషన్‌కు సక్సెసర్‌గా, ఎల్‌జీ సిగ్నేచర్‌ ఎడిషన్‌(2018)ను ఎల్‌జీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

తెలుపు, నలుపు రంగుల్లో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర 1,999,800 ఓన్‌లు అంటే దేశీయ కరెన్సీ ప్రకారం 1,22,820 రూపాయలు. ఐఫోన్‌ ఎక్స్‌ ధర రూ.1,02,425. ఐఫోన్‌ ఎక్స్‌ కంటే కూడా ఎల్‌జీ సిగ్నేచర్‌ ఎడిషన్‌(2018) స్మార్ట్‌ఫోనే ఖరీదైనది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీ-ఆర్డర్లు నేటి నుంచే ప్రారంభమవుతున్నాయి. ఎల్‌జీ సిగ్నేచర్‌ ఎడిషన్‌ 2018, జిర్కోనియం పింగాణీ వంటి ప్రీమియం మెటిరీయల్‌తో రూపొందింది. ఇది వెనుకవైపు ఎలాంటి గీతలు పడకుండా కాపాడుతోంది. ఈ డివైజ్‌కు వెనుకాల కస్టమర్లు తమ పేర్లను కూడా చెక్కించుకోవచ్చు. 

ఎల్‌జీ సిగ్నేచర్‌ ఎడిషన్‌ 2018 ఫీచర్లు...
6 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్‌ ఓలెడ్‌ డిస్‌ప్లే
కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌తో ప్రొటెక్షన్‌
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌
6 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
2 టీబీ వరకు విస్తరణ మెమరీ
వెనుకవైపు 16 మెగాపిక్సెల్‌ సెన్సార్లతో రెండు కెమెరాలు
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
3,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ
క్వాల్‌కామ్‌ క్విక్‌ ఛార్జ్‌ 3.0
వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top