
ఆ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు
ఎల్‌జీ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'జీ6'పై మరోసారి భారీ తగ్గింపు ప్రకటించింది.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్‌జీ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'జీ6'పై మరోసారి భారీ తగ్గింపు ప్రకటించింది. 'జీ6' ధరలో రూ. 9 వేలు కోత పెట్టింది. తాజా తగ్గింపుతో 'జీ6' స్మార్ట్‌ఫోన్ రూ.37,990కు భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. ఆన్‌లైన్, నేరుగా దుకాణంలో కొన్నా తగ్గింపు వర్తిస్తుంది. ఈ మేరకు రిటైలర్లకు ఎల్‌జీ సమాచారం అందించింది. అయితే అమెజాన్‌లో అస్ట్రో బ్లాక్, మిస్టిస్ వైట్ కలర్ ఫోన్లకు మాత్రమే తగ్గింపు ఉంటుంది. మూడో రకం ఐస్ ప్లాటినమ్ మోడల్ రూ.39,990కే లభ్యమవుతుంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో 'జీ6' స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఏప్రిల్‌లో భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినప్పుడు దీని ధర రూ.51,999గా ఉంది. అయితే వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో రూ. 10 వేలకు వరకు డిస్కౌంట్ ప్రకటించింది. తర్వాత అమెజాన్ ప్రైమ్ కొనుగోలుదారుల కోసం రూ.13వేల వరకు పరిమిత కాలపు డిస్కౌంట్ కూడా ఇచ్చింది. అప్పుడు ప్రైమ్ మెంబర్లకు రూ.38,990కే ఈ ఫోన్ లభ్యమయింది. అయినప్పటికీ అమ్మకాలు పెరగకపోవడంతో తాజాగా మరో రూ.9 వేలు తగ్గింపు ప్రకటించింది.
ఎల్‌జీ జీ6 ఫీచర్లు
5.7 ఇంచ్ క్యూహెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
1440 x 2880 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
4 జీబీ ర్యామ్
64 జీబీ ఇంటర‍్నల్ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13, 13 మెగాపిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరాలు
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0