జియో యూజర్లకు ‘బర్త్‌డే’ గిఫ్ట్‌

Jio Turns Two : Company Offers 42GB Data Per Month At Rs 100 - Sakshi

ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో పుట్టిన రోజు కానుకను ప్రకటించింది. రెండో వార్షికోత్సవ సెలబ్రేషన్స్‌లో భాగంగా నెలకు 100 రూపాయలకే 42 జీబీ హైస్పీడ్‌ 4జీ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు, జియో యా​ప్స్‌ను సబ్‌స్క్రిప్షన్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్‌ సెప్టెంబర్‌ 12 నుంచి సెప్టెంబర్‌ 21 వరకు వాలిడ్‌లో ఉండనున్నట్టు తెలిపింది. మైజియో యాప్‌ ద్వారా ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే ఈ ఆఫర్‌ 84 రోజులకు అందిస్తున్న రూ.399 ప్లాన్‌ ద్వారా పొందాల్సి ఉంది. రూ.399 ప్లాన్‌ను రూ.100 డిస్కౌంట్‌తో కేవలం రూ.299కే అందిస్తుంది. దీంతో నెలకు ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ ధర 100 రూపాయలే  పడుతుంది. రూ.299తో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్, 126 జీబీ డేటా, ఎస్ఎంఎస్ వినియోగించుకోవచ్చు. అంటే నెలకు సగటున 42 జీబీ డేటాను వస్తోంది. రూ.50ను జియో ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌గా అందిస్తుండగా.. మరో రూ.50 క్యాష్‌బ్యాక్‌ను మైజియోపై ఫోన్‌పే ద్వారా అందిస్తుంది. అయితే ఈ ఆఫర్‌ కేవలం తన ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్లకు, ఫోన్‌పే ద్వారా రీఛార్జ్ చేసుకుంటేనే లభిస్తుంది.

ఎలా ఈ ఆఫర్‌ పొందాలి?
మొదట మైజియో యాప్‌లోకి లాగిన్ కావాలి.
‘బయ్‌’ ఆప్షన్‌పైన క్లిక్ చేయాలి, రూ.399 రీఛార్జ్‌ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి.
పేమెంట్‌ మోడ్‌ పేజీలో, అందుబాటులో ఉన్న వాలెట్‌ ఆప్షన్ల జాబితా నుంచి ఫోన్‌పేను ఎంపిక చేసుకోవాలి.
మీ ఫోన్‌పే అకౌంట్‌లోకి సైన్‌-ఇన్‌ అయి, వన్‌-టైమ్‌ పాస్‌వర్డ్‌తో ఫోన్‌పే అకౌంట్‌ను వెరిఫై చేసుకోవాలి. 
‘పే బై ఫోన్‌పే’ను క్లిక్‌చేయాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top