జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభంలో కీలక పరిణామం

Jet Airways Founder Naresh Goyal Agrees To Step Down As Chairman: Report - Sakshi

జెట్‌ ఎయిర్‌వేస్‌ నుంచి తప్పుకోనున్న నరేష్‌ గోయల్‌

ఇతిహాద్‌,  జెట్‌ మధ్య కీలక ఒప్పందం

సాక్షి, ముంబై:  బిలియన్‌ డాలర్ల అప్పులు,  రుణ బాధలు, నిధుల లేమి, కనీసం పైలట్లకు జీతాలు కూడా  చెల్లించలేని సంక్షోభంలో ఉన్న దేశీయ విమానయాన సం‍స్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ నుంచి   చక్కదిద్దే కసరత్తుగా భాగంగా కీలక పరిణామం  చోటు చేసుకోనుంది.  జెట్‌ ఎయిర్‌ వేస్‌ వ్యవస్థాపకుడు  నరేష్‌ గోయెల్  సంస్థనుంచి వైదొలగనున్నారు.  ప్రస్తుతం 51శాతం వాటా కలిగిన  ఆయన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఛైర్మన్‌గా గోయల్‌ తప్పుకునేందుకు అంగీకరించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

నష్టాలతో కునారిల్లుతూ, నిర్వహణ కార్యకలాపాలకే నిధుల్లేక జెట్‌ ఎయిర్‌వేస్‌కు వాటా దారైన ఇతిహాద్ ఎయిర్‌లైన్స్‌ బెయిల్‌​అవుట్‌ ప్యాకేజీతో ముందుకు వచ్చిన నేపథ్యంలో గోయల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు  ఇరు విమానయాన​ సంస్థలు  ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోన్నుయంటూ ఇప్పటికే వార్తలు బిజినెస్‌ వర్గాల్లో వ్యాపించాయి.  ఇతిహాద్‌కు ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్‌లో 24శాతం వాటా ఉండగా, మరో రూ. 700 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. దీనిపై ఇప్పటికే పలు మీడియా సంస్థలు నివేదించాయి కూడా.. ఈ డీల్‌ ఓకే అయితే ఇతిహాద్ వాటా మరింత పెరగనుంది. అటు ఫౌండర్‌ నరేష్ గోయేల్ వాటాలు 20శాతానికి పడిపోతాయి. అలాగే రూ. 3000 కోట్ల రుణాలు అందించడానికి రుణదాతలు ముందుకొచ్చాయని సమాచారం. అయితే తాజా పరిణామంపై జెట్‌ ఎయిర్‌వేస్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

మరోవైపు జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో వినయ్‌ దుబే ఉద్యోగులకు ఇచ్చిన సమాచారం ఆసక్తికరంగా మారింది. రాబోయే  కాలంలో మరింత కఠిన పరిస్థితులను ఎదుర్కోబోతోందని సిబ్బంది సహనంగా ఉండాలని పేర్కొన్నారు.  కంపెనీ నిలదొక్కుకునే ముందు కొన్ని ఇబ్బందులు తప్పవని, కానీ  ఉద్యోగుల సంపూర్ణ మద్దతు, నిబద్ధతతో  సమిష్టి కృషితో భవిష్యత్తులో బలమైన సంస్థగా నిలబడతామనే ధీమాను వ్యక్తం చేశారు. 

మరోవైపు జెట్‌ ఎయిర్‌వేస్‌కు అతిపెద్ద రుణదాతగా ఉన్న స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఇతర బ్యాంకులు,  ఛైర్మన్‌  నరేష్‌ గోయల్‌, ఇతిహాద్‌ సీఈఓ టోనీ డగ‍్లస్‌ మధ్య ఒక అత్యవసర  భేటీని ఏర్పాటు  చేసింది. అనంతరం జెట్‌ ఎయిర్‌వేస్‌ను గట్టెక్కించేందుకు త్వరలోనే ఒక పరిష్కారం దొరుకుతుందంటూ పిబ్రవరి 25న, కొంతమంది ముఖ్య వాటాదారులతో కలిసి ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.  

కాగా అద్దెలు చెల్లించలేక ఇటీవల 6బోయింగ్‌ 737 విమానాలను, 15 ఇతర విమానాలను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా పరిమాణాలతో జెట్ ఎయిర్ వేస్ రుణ బాధలనుండి బయట పడే అవకాశం ఉందని అంచనా. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top