బీమాకు.. హెపటైటిస్ అడ్డుకాదు! | Sakshi
Sakshi News home page

బీమాకు.. హెపటైటిస్ అడ్డుకాదు!

Published Sun, Aug 7 2016 11:46 PM

బీమాకు.. హెపటైటిస్ అడ్డుకాదు!

కీళ్ల నొప్పులు, అలసట, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే... ‘హెపటైటిస్ బీ’ పరీక్షలు చేయించమని సలహా ఇస్తారు.  ప్రధానంగా లివర్ దెబ్బతినడంతో పాటు పలు రకాల జబ్బులకు దారితీసే ఈ వ్యాధికి అపరిశుభ్రత, సురక్షితం కాని శృంగార విధానాల వరకూ పలు కారణాలున్నాయి. దాదాపు 4 కోట్ల మంది రోగులతో చైనా తరువాత ఇండియా ఈ వ్యాధి విషయంలో రెండో స్థానం లో ఉందని ఇటీవలే ఒక సర్వే తెలిపింది.

అయితే హెపటైటిస్‌కు గురయిన వ్యక్తి జీవిత బీమా రక్షణ అవకాశాన్ని  కోల్పోతాడని చాలా మంది భావిస్తుం టారు. ఇదెంతమాత్రం నిజం కాదు. వారు కూడా జీవిత బీమాకు అర్హులే. వ్యక్తులు జీవిత బీమా పొం దేందుకు అవకాశం లేని కొన్ని ప్రాణాంతక వ్యాధుల (కోవర్డ్ డిసీజెస్) జాబితాలోకి హెపటైటిస్ రాదు. అయితే కొన్ని విషయాలు మాత్రం గమనించాలి.

వాస్తవ కవరేజ్ ఎంత? ప్రీమియం వ్యయాలెంత? వంటివి వ్యాధికి సంబంధించిన పలు అంశాలపై ఆధారపడి ఉంటాయి. వ్యాధి తీవ్రత, గత చికిత్స రికార్డు, మెడికల్ హిస్టరీ ఇవన్నీ దీన్ని ప్రభావితం చేస్తాయి.

ఎలాంటి చికిత్స తీసుకున్నాడు? భవిష్యత్తులో తీసుకోబోయే చికిత్స విధానాలేంటి? వైద్యుడు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తున్నారా? అనేవి బీమా కంపెనీలు పరిశీలిస్తాయి.

ఏ వయసులో ఈ వ్యాధి వచ్చింది? లివర్ పనితీరు పరీక్షల (ఎల్‌ఎఫ్‌టీ) రీడింగ్స్ ఏమిటి? వ్యాధి వచ్చినప్పటితో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి మెరుగుపడిందా? మీరు వ్యాధిని తగ్గించుకోవటానికి ఎంత కృషి చేస్తున్నారు? మీరు వాడుతున్న మందులేంటి? వంటి అంశాలపై మీ ప్రీమియం, కవరేజీ ఆధారపడి ఉంటాయి. రిస్క్ అధికంగా ఉంటే... అధిక ప్రీమియం చెల్లించాలి. పూర్తిగా వ్యాధి తగ్గిన వారు మామూలు పాలసీలు, సగటు ప్రీమియం రేటుకు పొందే వీలూ ఉంది.

Advertisement
 
Advertisement