మళ్లీ కొలువుల జోరు | India Skills Report On Jobs Recruitments | Sakshi
Sakshi News home page

మళ్లీ కొలువుల జోరు

Nov 23 2018 8:22 AM | Updated on Nov 23 2018 8:22 AM

India Skills Report On Jobs Recruitments - Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగాలు వచ్చే ఏడాది జోరుగా రానున్నాయని ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్, 2019  పేర్కొంది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఐటీ, వాహన, పర్యాటక, ఆతిథ్య రంగాల్లో ఉద్యోగవకాశాలు ఇబ్బడిముబ్బడిగా రానున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. హెచ్‌ఆర్‌ సొల్యూషన్స్, హెచ్‌ఆర్‌ టెక్నాలజీ కంపెనీ పీపుల్‌ స్ట్రాంగ్, గ్లోబల్‌ టాలెంట్‌ అసెస్‌మెంట్‌ సంస్థ వీబాక్స్‌ సంస్థలు, భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సహకారంతో ఈ నివేదికను రూపొందించాయి. ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు అధిక అవకాశాలుంటాయంటున్న ఈ నివేదిక వెల్లడించిన కొన్ని

ముఖ్యాంశాలు...
♦ ఉద్యోగాలిచ్చే విషయమై 64 శాతం కంపెనీలు సానుకూలంగా ఉన్నాయి. 20 శాతం కంపెనీలు మాత్రం 2018లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో 2019లో కూడా అన్నే ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నాయి. కొన్ని కంపెనీలు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పాయి.  
♦ 2017లో 7 శాతం వృద్ధి ఉన్న కొత్త ఉద్యోగాల కల్పన వచ్చే ఏడాది రెట్టింపై 15 శాతానికి చేరుతుంది. వివిధ రంగాల్లోని చిన్న, మధ్య, పెద్ద, భారీ స్థాయి కంపెనీలు చెప్పుకోదగిన స్థాయిలోనే ఉద్యోగాలివ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.  
♦ 2010–11 సంవత్సరంలో వివిధ రంగాల్లో భారీగా ఉద్యోగాలొచ్చాయి. వచ్చే ఏడాది ఈ స్థాయిలో కాకపోయినా, గత 2–3 ఏళ్లతో పోల్చి తే మంచి స్థాయిలోనే ఉద్యోగాలు వస్తాయి.  
♦ టెక్నాలజీ రంగంలో భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి. డిజైన్, అనలిటిక్స్‌ ఉద్యోగాలు అధికంగా ఉంటాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి స్పెషలిస్ట్‌ టెక్నాలజీ ఉద్యోగాలకు డిమాండ్‌ అధికంగా ఉండనుంది.  
♦ ఉద్యోగ కల్పన విషయంలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలుస్తుంది. తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఉన్నాయి.  
♦ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు అధికంగా ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. వీరిలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఈ), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) అభ్యర్థులకు అవకాశాలు అధికంగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement