ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఆదాయం రూ.515 కోట్లు

ICICI Securities revenue is Rs. 515 crores - Sakshi

ఒక్కో షేర్‌కు రూ.3.90 డివిడెండ్‌

ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్‌ అనుబంధ కంపెనీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌(క్యూ4)లో రూ.515 కోట్ల ఆదాయాన్ని ఆర్జిం చింది. అంతక్రితం ఏడాది ఆదాయం రూ.381 కోట్లతో పోలిస్తే 35% పెరిగింది. నికర లాభం రూ.83 కోట్ల నుంచి 91% వృద్ధి చెంది రూ.159 కోట్లకు ఎగసిందని పేర్కొంది. ఇబిటా 86% పెరుగుదలతో రూ.260 కోట్లకు వృద్ధి చెందిందని తెలిపింది. రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.3.90 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొంది.

ఇక ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.1,404 కోట్లుగా ఉన్న ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 32 శాతం వృద్ధితో రూ.1,859 కోట్లకు, అలాగే నికర లాభం 65 శాతం వృద్ధితో రూ.558 కోట్లకు పెరిగాయని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో 4.6 లక్షల మంది కొత్త క్లయింట్లు జత అయ్యారని, దీంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 40 లక్షలకు పెరిగిందని వివరించింది.బీఎస్‌ఈలో సోమవారం ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌  షేర్‌ 1.5% లాభంతో రూ.429 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top