పెరుగుతున్న ‘డిజిటల్‌’ అంతరం! | Growing 'digital' space | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న ‘డిజిటల్‌’ అంతరం!

Dec 26 2017 12:36 AM | Updated on Dec 26 2017 12:36 AM

Growing 'digital' space - Sakshi

కోల్‌కతా: ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ(ఐసీటీ) విషయంలో అభివృద్ధి చెందిన, పేద దేశాల మధ్య అంతరానికి ముగింపు పలకాలని యునిసెఫ్‌ పిలుపునిచ్చింది. పేద దేశాల్లో 15 శాతం మందికే ఇంటర్నెట్‌ అనుసంధానత ఉన్నట్టు పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాల్లో 81 శాతం మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నట్టు తెలిపింది. భారత్‌సహా 24 దేశాలను పరిగణనలోకి తీసుకుని యునిసెఫ్‌ 2017 ఏడాదికి సంబంధించి ఓ నివేదిక విడుదల చేసింది. ‘‘ఇంటర్నెట్‌ లభ్యత లేకపోవడం వల్ల చిన్నారులు గొప్ప విద్యా వనరులు, ఇన్ఫర్మేషన్, ఆన్‌లైన్‌ విద్యావకాశాలను కోల్పోతున్నారు’’ అని నివేదిక పేర్కొంది. ముఖ్యాంశాలు... 

►ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాల్లోని కార్మికుల వేతనాలపై ఐసీటీ ప్రభావం గణనీయంగా ఉంది. ఐసీటీ అనుభవం లేని వారు తక్కువ వేతనం పొందుతున్నారు. భారత్, ట్యునీషియాలోనూ ఇదే విధమైన ధోరణులు కనిపిస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. 

►15–24  వయసున్న వారిలో 29% మంది (34.6 కోట్ల మంది) ఇంటర్నెట్‌ సౌకర్యం లేనివారే. చిన్న పిల్లల విషయంలో  ఈ గణాంకాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. 15 ఏళ్లలోపున్న వారిలో కేవలం 30% మందికే ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ మీడియా అనుసంధానత ఉంది. 

► ప్రపంచవ్యాప్తంగా మహిళలతో పోలిస్తే 12% మంది పురుషులు ఎక్కువగా నెట్‌ వాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement