‘డ్రమ్‌ ఫుడ్స్‌’లో దీపికా పదుకొనె పెట్టుబడులు | Deepika Padukone Investments in Drum Foods | Sakshi
Sakshi News home page

‘డ్రమ్‌ ఫుడ్స్‌’లో దీపికా పదుకొనె పెట్టుబడులు

May 15 2019 8:53 AM | Updated on May 15 2019 8:53 AM

Deepika Padukone Investments in Drum Foods - Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటీమణి దీపికా పదుకొనె డ్రమ్‌ ఫుడ్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీ ఎపిగామియా బ్రాండ్‌ కింద పెరుగును విక్రయిస్తోంది. దీపికా పెట్టుబడులను కంపెనీ నూతన ఉత్పత్తుల ఆవిష్కరణకు, కొత్త ప్రాంతాల విస్తరణకు వినియోగిస్తామని కంపెనీ ప్రకటించింది. అలాగే, ఎపిగామియా బ్రాండ్‌కు దీపికా బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ పనిచేయనున్నారు. ఇటీవలే బెల్జియంకు చెందిన వెర్లిన్వెస్ట్‌ ఆధ్వర్యంలో సిరీస్‌ సి దశ నిధుల సమీకరణ ముగియగా, దీపికా పెట్టుబడులు దీనికి కొనసాగింపుగా డ్రమ్‌ ఫుడ్స్‌ తెలిపింది. 2015లో ఎపిగామియా బ్రాండ్‌ కింద ఈ సంస్థ విక్రయాలను ప్రారంభించింది. తాజా పెట్టుబడితో దీపికా పదుకొనె డ్రమ్‌ ఫుడ్స్‌లో వాటాదారుగా మారారు. అయితే, ఆమె ఎంత మేర ఇన్వెస్ట్‌ చేశారన్న వివరాల గురించి మాత్రం సంస్థ వెల్లడించలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement