
కెయిర్న్ ఇండియాకు రూ.10,948 కోట్ల నష్టాలు
కెయిర్న్ ఇండియా కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.10,948 కోట్ల నికర నష్టాలు వచ్చాయి.
♦ ముడి చమురు ధరల క్షీణతే కారణం
♦ ఒక్కో షేర్‌కు రూ.3 డివిడెండ్
న్యూఢిల్లీ: కెయిర్న్ ఇండియా కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.10,948 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. కెయిర్న్ ఇండియాకు ఒక్క క్వార్టర్‌లో ఇంత భారీ స్థాయిలో నష్టాలు రావడం ఇదే మొదటిసారి. గుడ్‌విల్, చమురు ధరలు పడిపోవడం వల్ల ఉత్పత్తి చేయని ఆయిల్, గ్యాస్ ఆస్తులపై ఇంపెయిర్‌మెంట్ నష్టం (ఆస్తి విలువ తగ్గింపు)వల్ల ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని విశ్లేషకులంటున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.241 కోట్లుగా ఉన్న నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.10,948 కోట్లకు పెరిగిందని కెయిర్న్ ఇండియా సీఎండీ మయాంక్ అషర్ పేర్కొన్నారు. ముడి చమురు ధరలు పడిపోవడంతో టర్నోవర్ 36 శాతం తగ్గి రూ.1,717 కోట్లకు తగ్గిందని వివరించారు. నష్టాలు భారీగా ఉన్నప్పటికీ, ఒక్కో షేర్‌కు రూ.3 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొన్నారు.