బెడ్‌బాత్‌మోర్‌డాట్‌కామ్ చేతికి క్రూడ్ ఏరియా | bedbathmore.com Hand Crude Area | Sakshi
Sakshi News home page

బెడ్‌బాత్‌మోర్‌డాట్‌కామ్ చేతికి క్రూడ్ ఏరియా

Jun 16 2015 1:35 AM | Updated on Sep 3 2017 3:47 AM

బెడ్‌బాత్‌మోర్‌డాట్‌కామ్ చేతికి క్రూడ్ ఏరియా

బెడ్‌బాత్‌మోర్‌డాట్‌కామ్ చేతికి క్రూడ్ ఏరియా

ఆన్‌లైన్ హోమ్ డెకార్ స్టోర్ ‘బెడ్‌బాత్‌మోర్‌డాట్‌కామ్’ తాజాగా గ్రాఫిక్ ఆర్ట్స్ సంస్థ ‘క్రూడ్ ఏరియా’ను కొనుగోలు చేసింది...

ముంబై: ఆన్‌లైన్ హోమ్ డెకార్ స్టోర్ ‘బెడ్‌బాత్‌మోర్‌డాట్‌కామ్’ తాజాగా గ్రాఫిక్ ఆర్ట్స్ సంస్థ ‘క్రూడ్ ఏరియా’ను కొనుగోలు చేసింది. పూర్తిగా షేర్ల రూపంలో జరిగిన ఈ డీల్ కోసం ఎంత వెచ్చించినదీ కంపెనీ వెల్లడించలేదు. ఇకపై క్రూడ్ ఏరియా వ్యవస్థాపకులు సహా ఉద్యోగులంతా కూడా బెడ్‌బాత్‌మోర్‌డాట్‌కామ్‌లో భాగమవుతారని పేర్కొంది. డీల్ అనంతరం కూడా క్రూడ్ ఏరియా స్వతంత్ర సంస్థగా సర్వీసులు అందిస్తుందని వివరించింది. వెబ్‌చట్నీ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్‌రావు 2012లో క్రూడ్ ఏరియాను ప్రారంభించారు. మేక్‌మైట్రిప్ సహవ్యవస్థాపకుడు సచిన్ భాటియా ఏంజెల్ ఇన్వెస్టర్‌గా ఇందులో పెట్టుబడులు పెట్టారు. దేశ, విదేశ ఆర్టిస్టులు రూపొందించిన గ్రాఫిక్ ఆర్ట్.. క్రూడ్ ఏరియాలో లభ్యమవుతుంది.

Advertisement
Advertisement