చైనాలో అమెజాన్‌ ఈ–కామర్స్‌ సేవలు నిలిపివేత | Amazon to close its online biz in China: Report | Sakshi
Sakshi News home page

చైనాలో అమెజాన్‌ ఈ–కామర్స్‌ సేవలు నిలిపివేత

Apr 24 2019 12:49 AM | Updated on Apr 24 2019 12:49 AM

Amazon to close its online biz in China: Report - Sakshi

శాన్‌ ఫ్రాన్సిస్కో: అమెరికాకు చెందిన ఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజం అమెజాన్‌.. చైనాలో తన ఈ–కామర్స్‌ సేవలను నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. అక్కడి ప్రాంతీయ మార్కెట్లో బలపడిపోయిన ఆలీబాబా, జేడీ డాట్‌ కాం, పిన్‌డ్యూడ్యూ సంస్థలతో పోటీపడలేక తన 15 ఏళ్ల మార్కెట్‌ స్థానాన్ని వదులు కోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.
 

మార్కెట్‌ వాటాలో ఆలీబాబాకు 58.2 శాతం ఉండగా.. ఆ రెండు సంస్థలకు 22 శాతం వరకు వాటా ఉంది. ఈ మూడింటి జోరుతో అమెజాన్‌ వెనకపడిపోయిన కారణంగా జూలై 18 నుంచి ఈ–కామర్స్‌ సేవల విభాగాన్ని నిలిపివేయనుంది. ఇక మిగిలిన సేవలైన వెబ్‌ సర్వీసెస్, కిండ్లీ ఈ–బుక్స్, క్రాస్‌ బోర్డర్‌ ఆపరేషన్లు యథావిధిగా కొనసాగనున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement