అలెంబిక్‌ ఫార్మా... షేర్‌కు రూ. 4 డివిడెండ్‌ | Alembic Pharma posts net profit of ₹ 93.80 cr in Q4 | Sakshi
Sakshi News home page

అలెంబిక్‌ ఫార్మా... షేర్‌కు రూ. 4 డివిడెండ్‌

May 17 2018 1:18 AM | Updated on May 17 2018 1:18 AM

Alembic Pharma posts net profit of ₹ 93.80 cr in Q4 - Sakshi

న్యూఢిల్లీ:  అలెంబిక్‌ ఫార్మా కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.94 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో 93 కోట్ల నికర లాభం వచ్చిందని అలెంబిక్‌ ఫార్మా తెలిపింది. ఆదాయం రూ.741 కోట్ల నుంచి రూ.853 కోట్లకు ఎగసిందని అలెంబిక్‌ ఫార్మా ఎమ్‌డీ ప్రణవ్‌ అమిన్‌ తెలిపారు. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.4 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు.  

ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.403 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.413 కోట్లకు పెరిగిందని ప్రణవ్‌ తెలిపారు. ఆదాయం రూ.3,135 కోట్ల నుంచి రూ.3,131 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. వివిధ సమస్యలున్నప్పటికీ, అమెరికా జనరిక్‌ వ్యాపారం 45 శాతం వృద్ధి చెందిందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో అలెంబిక్‌ ఫార్మా షేర్‌0.2 శాతం లాభంతో రూ.482 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.468 వద్ద ఏడాది కనిష్ట స్థాయిని తాకింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement