రెండేళ్లలో 3,000 ఉద్యోగాల భర్తీ! | AGS Health to hire 1500 professionals | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో 3,000 ఉద్యోగాల భర్తీ!

Aug 18 2016 12:32 AM | Updated on Sep 4 2017 9:41 AM

రెండేళ్లలో 3,000 ఉద్యోగాల భర్తీ!

రెండేళ్లలో 3,000 ఉద్యోగాల భర్తీ!

ఆరోగ్య విశ్లేషణ, మెడికల్ కోడింగ్ సేవలందిస్తున్న అమెరికాకు చెందిన ఏజీఎస్ హెల్త్...

సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ దేవేంద్ర సహారియా
హైదరాబాద్‌లో ఏజీఎస్ హెల్త్ రెండో కేంద్రం ప్రారంభం

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఆరోగ్య విశ్లేషణ, మెడికల్ కోడింగ్ సేవలందిస్తున్న అమెరికాకు చెందిన ఏజీఎస్ హెల్త్... 3 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో హైటెక్‌సిటీలో తన రెండో కేంద్రాన్ని ప్రారంభించింది. బేగంపేటలో 600 సీట్ల సామర్థ్యం గల తొలి కేంద్రాన్ని ఈ సంస్థ గతేడాది ప్రారంభించింది. ఈ రెండు కేంద్రాల్లో కలిపి సుమారు 1,500 మంది ఉద్యోగులుంటారని.. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్యను 3 వేలకు తీసుకెళతామని ఏజీఎస్ హెల్త్  ఫౌండర్ అండ్ సీఈఓ దేవేంద్ర సహారియా చెప్పారు.

బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... ‘‘ప్రస్తుతం ఇండియా, అమెరికాలో కలిపి మొత్తం 13 కార్యాలయాలున్నాయి. 10-12 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో దేశంలో తమిళనాడులోని వెల్లూరులో 4, చెన్నైలో 4, నోయిడాలో 1, హైదరాబాద్‌లో 2 మొత్తం 11 కార్యాలయాలను ఏర్పాటు చేశాం’’ అని వివరించారు. హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిలదొక్కుకున్న అనంతరం ద్వితీయ శ్రేణి పట్టణాలకూ విస్తరిస్తామని.. అలాగే డేటా ఇంటిగ్రేషన్, అనలిటిక్స్ విభాగాల్లోనూ సేవలను విస్తరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈడీఅండ్ హైదరాబాద్ హెడ్, ఆశీష్ అగర్వాల్, హెచ్‌ఆర్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్ ఈడీ స్మితా వెంకటరామన్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement