కుప్పకూలుతున్న అడాగ్‌ షేర్లు

ADAG shares down; Reliance Infra  dipped  post Q4 results  - Sakshi

సాక్షి, ముంబై:  అనిల్‌అంబానీ నేతృత్వంలోని అనిల్‌ ధీరూభాయ్‌ అంబానీ గ్రూప్ అడాగ్‌ గ్రూపు షేర్లు మరోసారి భారీగా నష్టపోతున్నాయి. గ్రూపులోని కీలకమైన రిలయన్స్‌ఇన్‌ఫ్రా 2018-19 క్యు4 ఫలితాలను శుక్రవారం ప్రకటించింది.   ఈ ఫలితాల్లో ఏకంగా  రూ.3,301కోట్ల నష్టాలను సంస్థ ప్రకటించింది. దీంతో సోమవారం రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన పలు కంపెనీల షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.  ముఖ్యంగా రిలయన్స్‌ ఇన్‌ఫ్‌రా   11శాతం కుప్పకూలింది. ఇతర సంస్థలు రిలయన్స్‌ క్యాపిటల్‌ షేరు 7శాతం, రిలయన్స్‌ పవర్‌ కౌంటర్‌ 3 శాతం, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ 5శాతానిపైగా నష్టపోతున్నాయి. 

మరోవైపు బిజినెస్‌ నిర్వహణలో కంపెనీ సామర్థ్యంపై తాజాగా ఆడిటర్లు సందేహాల నేపథ్యంలో  రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. అంతేకాదు  అనుబంధ సంస్థ ముంబై మెట్రో.. గ్రూప్‌లోని మరో కంపెనీ రిలయన్స్ నావల్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, తదితర అనుబంధ సంస్థలపైనా ఆడిటర్లు ఆందోళన వెలిబుచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రధాన సంస్థ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నష్టాలు నమోదు చేస్తున్నందున కంపెనీ గ్యారంటర్‌గా ఉన్న రుణాల విషయంలోనూ సందేహాలున్నట్లు ఆడిటర్లు పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top