ఆ 15 కంపెనీలకు అమెరికా షాక్‌

15 companies debarred from applying for H-1B visas - Sakshi

హెచ్‌-1బీ, ఎల్‌1 వంటి నాన్‌-ఇమ్మిగ్రాంట్‌ వీసాలను రెన్యువల్‌ చేయించుకోవడం ప్రస్తుతం చాలా క్లిష్టతరంగా మారింది. ట్రంప్‌ కార్యాలయం తీసుకొస్తున్న నిబంధనలతో హెచ్‌-1బీ వీసాదారులకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. అమెరికన్‌ వర్కర్లను కాపాడటానికి ట్రంప్‌ కార్యాలయం హెచ్‌-1బీ వీసాల్లో కొత్త కొత్త పాలసీలను తీసుకొస్తోంది. అయితే దేశీయ టెకీలకు ఊరటగా.. తమ దేశం నుంచి బలవంతంగా హెచ్‌-1బీ వీసాదారులను పంపే ప్రతిపాదనేమీ లేదని కూడా అమెరికా ప్రభుత్వం తేల్చి చెబుతోంది. ఇలా హెచ్‌-1బీ వీసాలపై రోజుకో చర్చ కొనసాగుతూ ఉండగానే... అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌-1బీ వీసాలను దరఖాస్తు చేయకుండా.. 15 కంపెనీలను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టింది.

అవేమిటో ఓ సారి చూద్దాం...
అజెల్‌ టెక్నాలజీస్‌ ఇంక్‌
అమికా టెక్నాలజీ సొల్యూషన్స్‌, ఎల్‌ఐసీ
క్లిన్‌రాన్‌ ఎల్‌ఎల్‌సీ203
డెల్టా సెర్చ్‌ ల్యాబ్స్‌, ఇంక్‌.
ఫోస్కామ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌, ఎల్‌ఎల్‌సీ
జీ హెల్త్‌కేర్‌ ఎల్‌ఎల్‌సీ
ఇంకోన్‌ కార్పొరేషన్‌, ఇంక్‌.
ఎండీ2 సిస్టమ్స్‌, ఇంక్‌.
నార్తరన్‌ కాలిఫోర్నియా యూనివర్సల్‌ ఎంటర్‌ప్రైజ్‌ కార్పొరేషన్‌
ఎన్‌వైసీ హెల్త్‌కేర్‌ స్టాఫింగ్‌, ఎల్‌ఎల్‌సీ
నిచె సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌, ఇంక్‌.
రైడ్‌స్ట్రా డైరీ, లిమిటెడ్.
తెలవా నెట్‌వర్క్స్‌, ఇంక్‌.
టెక్‌వైర్‌ సొల్యూషన్స్‌, ఇంక్‌.
మాక్రో నెట్‌వర్క్స్‌ కార్పొరేషన్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top