ఈ వారం రాశి ఫలాలు (20-07-2019)

Weekly Rasi Phalalu in Telugu (20-07-2019) - Sakshi

(సౌరమానం)

జన్మనక్షత్రం తెలియదా?నో ప్రాబ్లమ్‌!మీ పుట్టినరోజు తెలుసా? మీ పుట్టిన తేదీని బట్టి ఈవారం (జులై 20 నుంచి26 వరకు) మీ రాశి ఫలితాలుడా‘‘ -మైలవరపు శ్రీనివాసరావుజ్యోతిష్య పండితులు

కుంభం  (జనవరి 20 – ఫిబ్రవరి 18)
వ్యాపారంలో అలాగే వ్యవహారాల్లోనూ మీకంటూ ఒక ప్రత్యేక స్థాయి కలుగుతుంది. దాంతో మిమ్మల్ని ఆశ్రయించదలిచే వ్యక్తుల సంఖ్య పెరగచ్చు. ఇలాంటి సందర్భంలోనే మీరు ఏకపక్షంగా వ్యవహరించకుండా ఉండగలగాలి. లేని పక్షంలో వేరు తీరుగా మీ మీద ముద్రపడే అవకాశముంది. జాగ్రత్త! దూరప్రయాణాలు స్వదేశంలోనూ, ఒక సందర్భంలో విదేశానిక్కూడ ప్రయాణం చేయవలసి రావచ్చు.
ప్రస్తుత దశ బాగున్న కారణంగా ఎక్కడికి వెళ్లినా ఎంత దూరం ప్రయాణించినా ఎంతగా శారీరక శ్రమకి గురైనా అదంతా అదంతా లాభసాటిగానే ఉంటుంది తప్ప నిష్ఫలం కాకపోవడం చెప్పుకోదగ్గవిషయం. ఎందుకో తెలియదు గాని ముఖ్యమైన అధికారులు కొందరు మిమ్మల్ని ఆయా రంగాల్లో కొన్ని విషయాల గురించి సంప్రదిస్తూ ఉండచ్చు.
తగిన ధర్మబద్ధమైన సలహాలనే ఇయ్యండి తప్ప, ఆసక్తి పోయి ధనానికి లొంగి వేరు తీరుగా వ్యవహారాన్ని నడిపిస్తే అది చాల దూరం వెళ్లే అవకాశముంది. గమనించుకోండి. నూతనగృహం బహుశా ఈ నెలకి ముగియవచ్చు.

ముహూర్తాలు లేని కారణంగా గృహప్రవేశానికి ఎదురు చూసే పరిస్థితిలో ఉండచ్చు. మొగమాటానికి పోకుండా ఈ ఆస్తికి సంబంధించిన పప్రతాలన్నిటినీ ఒకటికి రెండు మార్లు పరిశీలించుకోండి. గట్టి న్యాయవాదికి చూపించుకోండి. పొరపాటు జరగకపోవచ్చుగాని రవి శుక్రులు అననుకూలురుగా ఉన్న కారణంగా మన జాగ్రతలో మనం ఉండడం అవసరం. మంచిది కూడ కదా! పాత పరిచయస్థులు ఒకరిద్దరు మీకు కలిసే అవకాశముంది. వినోద విహారయాత్ర పర్యటన కూడ ఉండచ్చు.
లౌకిక పరిహారం: ఆస్తి పత్రాలని మొగమాటం లేకుండా పరిశీలించుకోండి.
అలౌకిక పరిహారం: బోనాలకాలంలో అమ్మ స్తుతిని చేస్తూ యధాశక్తి చీరెని సమర్పించుకోండి.

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఎక్కడ వేసి గొంగళి అక్కడే అన్న చందంగా ఎంత పనిని శారీరకంగా శ్రమిస్తూ చేసినా చేస్తున్నా చేయడానికంటూ సిద్ధంగా ఉన్నా పనులన్నీ స్తబ్దతకే గురి ఔతూ మానసికంగా కొంత నిరుత్సాహాన్ని కలగజేయచ్చు. దిగులుపడకండి.

రవి గ్రహం అననుకూలునిగా ఉన్న కారణంగా పని కదలదు. బుద్ధి చురుకుగా ప్రయాణించకపోవచ్చు. ఎందుకో తెలియదుగాని కొంత ఎక్కువ మోతాదులోనే ఖర్చు కావచ్చు. అయితే జరిగే వ్యయం మాత్రం ప్రయోజనాత్మకంగానే ఉండే కారణంగా మానసికంగా బాధకి గురి కాకపోవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సంతానంలో ఒకరి విద్య దాంతో పాటు ప్రవర్తన ఒకమాదిరిగా ఉండే కారణంగా తెలియని ఆందోళన ప్రారంభం కావచ్చు. విద్య మీదే శ్రద్ధకంటె సంగీతం వాద్య సంగీతం చిత్రలేఖనం విశేషించి క్రీడల మీద దృష్టి కొంత ఎక్కువగా ఉండచ్చు.

కొట్టడం – తిట్టడం– పదిమందిని చూసి నేర్చుకోవలసిందంటూ వాణ్ణి అవమానానికి గురిచేయడం వంటివి సమస్యని మరింత జటిలం చేసే అవకాశముంది కాబట్టి నిదానంగానూ అర్థమయ్యే లాగానూ వాడికి వివరించి అవగాహనని కల్గించండి. పరిస్థితి అదుపులోకొస్తుంది– భయపడకండి. మిశ్రమ ఫలితాలు లభించే కాలం కాబట్టి వ్యాపారంలో ఎంత లాభం రాబోతుందో దాదాపుగా అంతకి సరిపడే తీరులో వ్యయం సిద్ధంగా ఉండడం జరగచ్చు. మిత్రుల్లా ఉండే అందరినీ విశ్వసించకండి. సహాయపడదలిచినా సమర్థత లేని కారణంగా వాళ్లు సహాయపడలేరు. కార్యాలయంలో పనిచేసే అందరికీ సకాలంలో జీతాలని ఈయడం మంచిది. లేని పక్షంలో అప్రతిష్టని మూట గట్టుకోవల్సిన పరిస్థితి రావచ్చు. అత్తమామల రాక ఉండచ్చు.

లౌకిక పరిహారం: మిశ్రమ ఫలితాలుంటాయి. కాబట్టి నిరుత్సాహపడకండి.
అలౌకిక పరిహారం: బోనాల కాలంలో అమ్మకి చద్దన్నం బెల్లం సమర్పించుకోండి.

మేషం(మార్చి 21 –ఏప్రిల్‌ 19)
అకస్మాత్తుగా గాలి దుమారం వచ్చినట్లయితే మనం మార్గమధ్యంలో ఉంటే ఎలా ఆ దుమ్ము మన మీద పడుతుందో అలాగే నిష్కారణంగా మీ మీదికి చిన్న అపనింద వచ్చే అవకాశముంది.
దానివల్ల తాత్కాలికమైన అప్రతిష్ఠ చాప కింద నీరులా రహస్యంగా మనిషి నుండి మనిషికి ప్రచారమౌతూ కలగచ్చు. మీది ఏ విధమైన అధర్మమూ కాదని నిర్థారించుకుని పరమ ధైర్యంగా ఉండండి. నీటి బుడగలా తాత్కాలిక ఆందోళన మీకు కలగచ్చు.

ఎంత వద్దని అనుకున్నప్పటికీ, మొగమాటం కారణంగానో, ఒత్తిడి వల్లనో, తప్పనిసరి అయిన పరిస్థితుల్లోనో ఓ ప్రయాణాన్ని ఇంకొకరితో కలిసి చేయవలసి రావచ్చు.
ఆ ప్రయాణం వల్ల ప్రయోజనం ఏ మాత్రమూ ఉండదని దాదాపుగా మీకు తెలిసినా ప్రయాణించవలసి వస్తుంది.
ఎన్ని కారణాలని చెప్పి వివరించి ప్రయాణాన్ని ఆపదలిచినా అది సాధ్యపడకపోవచ్చు. మొత్తం మీద ప్రయాణం చేస్తారు– ఆ ప్రయాణం వ్యర్థమనే విషయాన్ని దృఢం చేసుకుంటారు.
కుటుంబంలో చిన్న చిన్న మాటల కారణంగా అనవసర వివాదాలు కుటుంబ సభ్యుల మధ్య వచ్చే అవకాశముంది కాబట్టి వీలయినంతవరకూ తక్కువ తక్కువ మాట్లాడుకుంటూ ఉండడం లేదా కుటుంబ సభ్యులు ఏం మాట్లాడినా (నిష్ఠురంగా) దాన్ని పట్టించుకోకుండా ఉండ(గలగ)డం అవశ్యం ఈ వారంలో.

లౌకిక పరిహారాలు: ఇతరుల మాటలని కొద్దిగా భరించండి. ప్రతిస్పందించకండి.
అలౌకిక పరిహారాలు: బోనాల రోజుల్లో అమ్మవారి స్తోత్రాన్ని చదువుకోండి ప్రతిరోజూ. ఆమెకు పసుపుని సమర్పించుకోండి.

వృషభం (ఏప్రిల్‌ 20 –మే 20)
మీరు చేస్తున్న వృత్తీ ఉద్యోగం వ్యాపారం అనే వీటి మీద అనాసక్తి– అంటే ఓ నిరుత్సాహం, చక్కగా చేద్దామనే ఆలోచన, బాగా పెంచుదామనే తీరు ఊహా తాత్కాలికంగా లేకపోవచ్చు. జీవనానికి ఆధారభూతమైన వీటి నిర్వహణలో ఒకటికి రెండు ఎదురు దెబ్బలు తగిలేసరికి ఈ తీరు భావన కలిగి ఉండచ్చు. ఏ మాత్రమూ వెనుకాడకుండా కొనసాగించ దలిచిన నిర్ణయంతో పెద్దల్నీ అనుభవజ్ఞుల్నీ సంప్రదిస్తే వాళథ్లు తగిన మెళకువలని చెప్తారు. నిర్భయంగానూ, నిస్సంశయంగానూ నూతనోత్సాహంతో ముందుకెళ్లగలుగుతారు.
ఉద్యోగస్థులైనట్లయితే తోటి ఉద్యోగులతో అంత సయోధ్య ఉండకపోవచ్చు. ఎంత చేసినప్పటికీ పై అధికారులకి సంతృప్తి అనిపించకపోవచ్చు. అయినా తోటి ఉద్యోగులతో పై వాళ్లతో మనకెందుకు? మన పని మనం చేసుకుపోతూ ఉందామనే దృక్పథంతో సాగిపొండి తప్ప కార్యాలయాన్ని ఓ సమష్టి కుటుంబంలా ఉంటే బాగుండుననుకోవడం దేనికి? ఉద్యోగంలో ఉన్న మీకు ధర్మబద్ధంగా ఉంటూ జీతాన్ని సంపాదించుకోవడం ముఖ్యమనుకో(లే)ని పక్షంలో ఈ నిరాశా భావం కలుగుతుంటుంది. సాగిపొండి మీకిచ్చిన మార్గంలోనే. ఇతరుల మార్గం మీకనవసరమనుకోండి.
ఇది తినడానికీ అనుకోవడానికి కూడా ఏదోలా అనిపించవచ్చునేమో గాని మిత్రులూ బంధువులూ కూడా మరింత గట్టి కష్టకాలంలో సహాయానికి వచ్చేదీ రాగలిగేదీ కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని సిద్ధపడి మీకు మీరే తగు జాగ్రత్తలో ఉండండి. వాళ్లని తప్పు పట్టి ప్రయోజనం లేదు. ఎవరి సంసారాలు వాళ్లకున్నప్పుడు వాళ్ల సాయం పరోక్షం మాత్రమే.

లౌకిక పరిహారం: మీ పనిని మీరే చేసుకోవాలి. మీకు మీరే సహాయకులనుకోవాలి.
అలౌకిక పరిహారం: ఈ ఆషాఢంలో అమ్మవారికి గాజులని సమర్పించుకుని స్తుతి చేయండి.

మిథునం(మే 21 –జూన్‌ 20)
మబ్బులు ఎలా వచ్చాయో అలాగే గాలికి దూరంగా చెదిరిపోయే విధంగా– నిందలు రావడానిక్కారణమూ మీరు కాదు, అలాగే మీ మీద వచ్చిన అపనిందలు తొలగిపోవడానికంటూ మీరు ప్రయత్నించినదీ ఏమీ లేదు– అలా అన్ని అపనిందలూ తొలగిపోయిన కారణంగా ఎంతో సంతోషంగా ఉంటారు. రవి రాహు కేతువులు అర్ధ శుభులైన కారణంగా ఈ తీరు మానసికాందోళన పడవలసి వచ్చింది– అది క్రమంగా తొలగిపోయింది అంతే!
మీకు మీరుగా నోటి దురుసుతనాన్ని చూపించకుండా ఉండడం ఎంతైనా అవసరం. కాలం కలిసిరానప్పుడు శత్రువుతో కూడా తప్పనిసరిగా మిత్రభావంతోనే ఉండాలి. లేని పక్షంలో కార్యాలు సఫలం కాదు. దేవతలంతటి వాళ్లు అమృతాన్ని సాధించుకోవడం కోసం మనసా వాచా కర్మణా కూడా పూర్తిగా విరోధించేవాళ్లూ తమని తృణీకార భావంతో చూసేవాళ్లూ పరిహసిస్తూ అపహాస్యం చేస్తుండేవాళ్లూ అయిన దానవులతో జత కట్టలేదా? పనుల నిర్వహణ కోసం ఈ తీరు మైత్రి తప్పు కాదు. అలా కలుపుకుని వెళ్లండి. దిగులుండదు. కొద్దికాలం పాటు, ఈ తీరు ప్రవర్తన మీకు తప్పదు.
అకస్మాత్తుగా మీలో ఆధ్యాత్మిక భావం మరింత కావచ్చు. మంచిదే కదా! తీర్థయాత్రలూ, పుణ్యనదీ స్నానాలూ దానధర్మాలూ జపతపాలూ కొత్త కొత్త స్తోత్రాలని నేర్చుకోవడం వంటివి జరగచ్చు. మానసికంగా నిర్మలంగా సంతోషంగా ఉత్సాహంగా ఉండడానికివన్నీ బండికుండే చక్రాలకి కందెన (చక్కగా తిరగడానిక్కావలసిన ఇరుసుకి నూనె) వంటివి. అదృష్టమనేది ఉన్నప్పుడే– రాబోతున్నప్పుడే ఇలాంటి ఆలోచనలొస్తాయి. రానియ్యండి. అయితే ఆధ్యాత్మిక దృష్టిలో ‘అతి’ లేకుండా చూసుకోండి.

లౌకిక పరిహారం: అందరినీ కలుపుకెళుతుండండి.
అలౌకిక పరిహారం: ఈ బోనాల కాలంలో అమ్మస్తుతిని చేస్తూ కుంకుమని సమర్పించుకోండి.

కర్కాటకం(జూన్‌ 21 –జూలై 22)
వ్యసనాలు ఏడు మాత్రమే అని శాస్త్రం గద్దించి చెప్పింది గాని కీర్తి ప్రతిష్ఠల కోసం పాకులాడడమనేది కూడా ఓ వ్యసనమే. ఒక్కో సందర్భంలో పదిమందీ కూడా నవ్వుకునే తీరులో ఓ పురస్కారం కోసమో సంమానం కోసమో కానివారిని ప్రాధేయపడడం, తీవ్ర ప్రయత్నాన్ని చేస్తుండడం మీలో కనిపించవచ్చు. దయచేసి అలాంటి స్వీయ ప్రయత్నాన్ని చేసుకుంటూ మిమ్మల్ని మీరు అందరిలో నవ్వుల పాలయ్యేలా ప్రవర్తించవద్దు. జీవనానిక్కావలసిన వ్యక్తి ఉద్యోగ వ్యాపారాలున్నాయిగా! చాలు. వస్తుందో రాదో అనుకునే దానికోసం ఈ నీచ ప్రయత్నాలెందుకు? విరమించుకోండి.
అత్యాశ అనేది ఈ వారంలో మీకు కుజబుధులు అర్ధ శుభులుగా ఉన్న కారణంగా మిమ్మల్ని ఆవహించవచ్చు. ఆశ అనేది ఉండి తీరాలి. అది తప్పు ఏమాత్రమూ కాదు. ఆశ అనేది ఎంతవసరమో నిరాశ అనేది అంత తప్పు. నిరాశకి మించిన తప్పు అత్యాశ అనేది. ఎంత ఫలితాన్ని ఊహించిన దానికి మించి సాధించినా నిరుత్సాహాన్నే కలిగించే సామర్థ్యం అత్యాశకి ఉంది. దాంతో జీవితంలో సంతోషకర క్షణాలంటూ మీకుండక నిరుత్సాహమే మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా అయిపోవచ్చు. వెంటనే విడనాడండి ఆ ఆలోచనని.
మీరు చేస్తున్న ఉద్యోగం అలాగే వృత్తిలో వ్యాపారంలో మరింత మెరుగుదలకోసం మరింత కృషి అవసరం కావచ్చు. ఉద్యోగస్థులైతే పై పోటీ పరీక్షలకి సిద్ధపడాల్సిన అవసరం, వృత్తిలోనైతే మరిన్ని కొత్త వస్తువుల ఉత్పాదన కోసం పదిచోట్లకి తిరిగి రావాల్సి రావడం, అదే వ్యాపారంలోనైతే మరిన్ని వస్తువుల కొనుగోలు కోసం శ్రమించడం తప్పనిసరి కావచ్చు. అలా చేయండి. మంచిదే.
లౌకిక పరిహారం: అత్యాశకి పోకండి. చేస్తున్న దాన్ని వృద్ధి చేసుకోండి. అంత మాత్రమే.
అలౌకిక పరిహారం: బోనాల సందర్భంగా అమ్మని స్తుతిస్తూ అమ్మకి ధూపాన్ని సమర్పించుకోండి. (అగరు వత్తులు/ గుగ్గిలం).

సింహం(జూలై 23 –ఆగస్ట్‌ 22)
న్యాయస్థానంలో నలుగుతున్న అభియోగాల గురించిన తీర్పులు ఎలా ఉండబోతాయో? అనే మానసికాందోళనని తొలగిస్తూ తీర్పు చక్కగా వెలువడి సంతోషాన్నిస్తుంది. అవతలి పక్షం వారు ఆ తీర్పు మీద మళ్లీ పరిశీలనకి వెళ్లే అవకాశమూ లేదని తెలిసే కారణంగా మరింత సంతోషంతో ఉంటారు. మీకూ న్యాయస్థానానికీ ఉన్న రాకపోకలు ఇక లేనట్లే.
వ్యాపారం కొద్దిగా నష్టాల బాట పట్టి ఉండచ్చు. దానికి కారణం మీరు మరో చిరు వ్యాపారాన్ని ప్రారంభించి ఆ దిశగా మరింతగా ప్రయత్నాలు చేస్తూండడం, తగినంత మంది సహాయకులుగా మీకు లేకపోవడం, న్యాయస్థానానికి తిరగవలసిరావడం... ఇదిగో ఇలాంటివే తప్ప మరోటి కాదు. ముఖ్యంగా మీ అసమర్థత ఏ మాత్రమూ కానేకాదు. ఇప్పటికైనా వ్యాపారాల సంఖ్య మరిన్ని కాకుండా ఒకే వ్యాపారం మీద దృష్టి పెట్టినట్లయితే తప్పక మీకు అది అనుకూలతని, ఆర్థిక లాభాలనీ ఆర్జించపెట్టగలుగుతుందని గ్రహించండి.
ధనం సోదరసోదరీ సంబంధాలనీ, మిత్రుల్నీ, ఆప్తుల్నీ మొదటికాలంలో మరింత దగ్గర చేస్తుంది. మరి కొంత కాలమయ్యేసరికి పరస్పర ఆర్ధిక అవసరాల్ని సర్దుబాటుచేసుకునే విధానాల్లో చిన్న చిన్న తేడాల పగుళ్లు ప్రారంభమై మొత్తానికి ఆ సంబంధాలు తిరిగి ముడిపడలేనంత దారుణంగా అయిపోతాయి. ప్రస్తుతం మీ సోదర సోదరీ సంబంధాలకి ఆ పరిస్థితి రాబోతోంది. కాబట్టి మీరే ఒక రూపాయి నష్టపోవడానికి సిద్ధపడినట్లయితే, సంబంధాలు యథాతథంగా ఉంటాయి. అలా నష్టపోదలచక ఉన్నట్లయితే ముందునాటికి మీ కుటుంబపు మంచిచెడులకి, వాళ్ల రాకపోకలు సహాయసంబంధాలు తెగిపోవచ్చు. అలా చేసుకోవడం సరికాదు.
లౌకిక పరిహారం: ఆర్థిక సంబంధాలే ప్రధానమనుకుని సోదర సంబంధాలని తెంచుకోకండి.
అలౌకిక పరిహారం: బోనాల కాలం కాబట్టి అమ్మని స్తుతించి ఆ ఫలాన్ని అమ్మకి సమర్పించండి.

కన్య (ఆగస్ట్‌ 23 –సెప్టెంబర్‌ 22)
చేతికున్న ఐదు వేళ్లు ఎలా ఒకదానితో ఒకటి కలిసి మెలిసి ఒకే చోట ఉంటూ ఒకే అరచేతికి లోబడి ఉంటాయో ప్రతి పనినీ సఫలం చేస్తూ ఉంటాయో అలా మీ సోదరులంతా ఒకే తీరు ఆలోచనలతో ఉంటూ, ఇందరిలోఎవరిపనినైనా సరే తమ పని అనుకుంటూ కార్యసాధనని విజయవంతంగా చేసుకుంటూ ఉంటారు. ఇలాగే ఉండాలనే దృక్పథంతో ఉండండి. మీ మధ్యలోకి ఎవరినీ రానీయకండి. రానిచ్చుకోకండి. ఇది ముఖ్యం మీ ఐకమత్యానికి. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలని మీరు ముమ్మరంగా చేస్తూ ఉండవచ్చు. మంచి కదలిక కన్పించి తీరుతుంది. అయితే ప్రయత్నాల్లో విరామం మాత్రం వద్దు. రవిగ్రహం నుంచి అనుకూలునిగా ఉన్న కారణంగా కొత్త కొత్త ఆలోచనలు వస్తూ సరైన సంబంధం కోసం గట్టి ప్రయత్నాలని చేయగలుగుతారు. అదృష్టవశాత్తు సత్సంబంధాలే రాబోతున్నాయి కూడా. అనుమాన ధోరణిని విడిచి సరైన తీరులో ప్రశ్నలనడిగి సందేహాలను నివృత్తి చేసుకోవడం అవసరం తప్ప లౌక్యవిధానం ఈ దశలో వద్దేవద్దు.
అదృష్టవశాత్తు మీరు కొనుగోలు చేసినవన్నీ మంచి లాభాల దిశగా ఉండడం, అలాగే మీరు విక్రయించినవన్నీ మీకు మరింత లాభాన్ని తెచ్చిపెట్టి ఉండటం కారణంగా ఆర్థికంగా మీరు వెనుదిరిగి చూసుకునే అవసరం ఉండకపోవచ్చు. ఇంకా ఎంతెంతో సంపాదించాలనే ఆలోచనతో పరుగెత్తి పాలు తాగడం మాని, ఉన్నదాన్ని రక్షించుకోవడమనే తీరు, నీటిని నిదానంగా తాగుతూన్నట్లయితే మానసికారోగ్యంతో పాటు శారీరకారోగ్యం కూడా సక్రమంగా ఉంటుంది. ఆలోచించి మీకు మీరు అదుపులో ఉండేలా మీ గురించి మీరు ప్రయత్నించుకోండి.

లౌకిక పరిష్కారం: సాగుతున్న సంపాదనని అలా చూసుకోండి. అత్యాశతో పరుగులు వద్దు.
అలౌకిక పరిష్కారం: బోనాల కాలంలో అమ్మని స్తుతిస్తూ బోనాన్ని ఎత్తుకోండి లేదా గ్రామ దేవతని పూజించండి.

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
వేసవిలో ఎంత ఎండ అయితే ప్రజకి బాధ కలగదో, అలాగే శీతకాలంలో వర్షకాలంలో కూడా తగు మాత్రంగానే ఉంటే అందరూ ఎంత ఆనందిస్తారో అలా కాకుండా పెరిగితే ఎంతగా బాధకి గురవుతారో అలా మీరు మీ శత్రువులకి కొద్ది అధిక భారం కలిగేలానే శిక్షని న్యాయస్థానం ద్వారా విధింపబడేలా చేసి ఉండచ్చు.
వ్యక్తి తన నోటినుంyì  తిట్టే మాటలకంటె, మానసికంగా లోలోపల మథన పడితే దాని ప్రభావం అలా చేసిన వ్యక్తుల మీద ఉంటుందని శాస్త్రం చెప్తోంది కాబట్టి శత్రువుల మీద ఇంకా పదునైన కత్తులని దూసి తీరుదామనే ఆలోచన మంచిది కాదు. ఆలోచించండి.
ఆర్థికమైన నష్టాన్ని పూడ్చుకోవాలనే అభిప్రాయంతో చేసే ప్రతి ప్రయత్నమూ సఫలమౌతుంది. రవి బుధ గురు శని రాహు కేతువులందరూ మీకు శుభులుగా ఉన్న కారణంగా ఏ పనినైనా అప్రతిహతంగా చేయగలుగుతారు విజయం దిశగా. ప్రస్తుతం వచ్చిన చంద్రగ్రహణం కూడా మీకు శుభఫలితాన్నే ఈయబోతున్న కారణంగా దిగులు పడాల్సిన అవసరమే లేదని గ్రహించండి.
సంతానం ఒకవేళ మీ ఉద్యోగం కారణంగా మీకు దూరంగా ఉన్నట్లయితే వీలయినంత దగ్గర్లో మీ వద్దకి తెచ్చుకునే ఆలోచనని చేయండి. పెద్ద కష్టం కాబోదు. ఎంతైనా సంతానం తమ తలిదండ్రులవద్ద పెరిగిందానికీ వ్యత్యాసముంటుంది. అలాగని వాళ్ళు నిరాదరణతో ఉంటారనేది దీని భావం కాదుగాని చెట్టుకీ అంటుకట్టిన చెట్టుకీ వ్యత్యాసం ఉన్నట్టే ఇది కూడా అని భావించండి.
తప్పనిసరిగా ఆడంబరాలకీ అట్టహాసాలకీ కొంత ధనం ఖర్చు కాబోతుంది. సిద్ధపడి ఉండండి అది అవసరం మరి.

లౌకిక పరిహారం: శత్రువు మీద మరింత కాఠిన్యం చూపడం సరికాదు.
అలౌకిక పరిహారం: బోనాల కాలంలో అమ్మ ఆలయానికి వెళ్లి ఆశీస్సులని పొందండి.

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
మీరు పడుతున్న మానసిక వ్యధకీ– అయినప్పటికీ మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలనీ వ్యవహారాలనీ చక్కదిద్దుకుంటూన్నందుకూ ఎవరో అభినందించడం మాటటుంచి మిమ్మల్ని మీరు అభినందించుకోవలసిందే. దాదాపు 6 సంవత్సరాలుగా శని బాధకి గురి గురౌతూ– ముందూ వెనకా నుయ్యీ గొయ్యీగా ఉన్నా గంభీరంగా జీవితాన్ని సాగిస్తూ ఉండగలగడానికి కారణం మీ ధర్మబద్ధ ప్రవర్తనా– మంచి జరుగుతుందన్న ఎదురు చూపూ మాత్రమే.
ఓ పక్క తలిదండ్రులు మీ సమస్యా పరిష్కారంలో సరైన శ్రద్ధని చూపడం లేదేమోననే ఆలోచ మీకు రావచ్చు. అది సరికాదు. శాయశక్తులా వాళ్లూ ప్రయత్నిస్తున్నా రవి గురు గ్రహాల అననుకూలత కారణంగా ఎవరికీ అంతు పట్టనిదీ– అదుపులోకి రానిదీ అవుతోంది పరిస్థితది అని గమనించండి.
మీకు మీ బుద్ధికి సంబంధించిన ప్రాభవం కారణంగా గొప్పదైన ఓ వైజ్ఞానిక సదస్సులో పాల్గొనడానికి ఎవరికీ రాని అవకాశం లభించవచ్చు. ప్రస్తుత నిరుత్సాహంతో దాని వైపుకి దృష్టి సారించక– తగినంత కృషిని చేయక– చివరి క్షణంలో ఆ సదస్సులో పాల్గొనకుండా చేసుకోకండి. పాల్గొనడం వల్ల మీ కీర్తి కంటె ప్రతిష్ఠ పెరుగుతుంది. అందరిలోకీ మీ పేరు వ్యాప్తిలోకొచ్చి మరో మెట్టుని ఎక్కగల అవకాశం దగ్గరౌతుంది కూడా.
ఆరోగ్యాన్ని సక్రమంగా ఉండేలా కొద్ది దృష్టిని పెట్టండి. తీవ్ర అనారోగ్యం వచ్చే అవకాశం లేదుగానీ తాత్కాలికమైన శారీరక అనారోగ్యం కలిగే సూచన ఉందని గ్రహించుకోండి. పరిస్థితులన్నీ చక్కబడే కాలం ముందుంది. ధైర్యంగా ఉండండి.

లౌకిక పరిహారం: ధర్మాన్ని తప్పకండి. శని ఏమీ చేయలేనిది ధార్మికుడైన వ్యక్తినే.
అలౌకిక పరిహారం: బోనాల కాలంలో అమ్మ స్తుతిని చేస్తూ హారతిని పట్టండి.

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఓ పక్క ఏమీ కలిసి రావడం లేదనే నిరుత్సాహం, మరో పక్క సంతానం గురించిన చింతా, ఏం చేయాలో తోచనితనం మిమ్మల్ని మానసికంగా వేదనకి గురి చేయవచ్చు. కటుంబంలో ఉన్న రహస్యాలని ఎంత గుంభనగా మీరుంచుకుంటే అంత మంచిది తప్ప, పదిమందిలో చర్చకీ మీ కుటుంబ విషయాన్ని పెట్టకండి. పలచబడి పోతారు తప్ప ఒరిగేదంటూ ఏమీ ఉండబోదు.

శుక్ర రాహు కేతువులు అననుకూలురుగా ఉన్న కారణంగా ఏదైనా ఓ ఆలోచన రాగానే, వెంటనే ఆ ఆలోచన సరికాదనే భావన వచ్చేస్తుంది. ఈ కారణంగా ఔను– కాదు, చేద్దాం– చెయ్యొద్దు... అనే ఈ తీరు ఊహ అపోహలతో కాలక్షేపమైతే అయిపోతుంది తప్ప నిర్ణయం మాత్రం రాదు. సమస్య పరిష్కరింపబడదు.
మీ దంపతుల్లో అననుకూలత ఉండడం పెద్ద అదృష్టకరమైన అంశం. తొందరపాటుతనం మీలో ఉన్నా దంపతుల్లో మరొకరు నిదానిస్తుండే కారణంగా సంసార బంధంలో ఏ తీరు వ్యతిరేకతా ఉండదు. అందుకే చెప్పేది– కుటుంబ విషయాల్ని గోప్యంగా ఉంచుకోవలసిందని.

అత్తమామల్ని పలకరిస్తూ ఉండండి. ‘‘నేను మాట్లాడేదంతా యథార్థమే కాబట్టి ఉన్నదానినున్నట్టుగా కూడా పగలగొట్టి చెప్తా’’ననుకుని, అదో గొప్ప విషయమనుకుని ఆ తోవన ప్రయాణించకండి. ఇబ్బంది ఎంతో దూరంలో లేదు. మీరు వ్యాపారస్థులుగాని అయి ఉంటే, పోటీ వ్యాపారస్థుడు రావచ్చు. ఉద్యోగస్థులయితే మీ మీద ఏమేమో పై అధికారికి చెప్పే వారుండచ్చు. ఇలా ఉన్నాయి కదా అని భయపడకండి. ఇవన్నీ మిమ్మల్ని ఏమీ చేయ(లే)వు గాని ముందస్తు భయాన్ని కలగజేసి తీరుతాయి. తాత్కాలిక మనోవేదనని కల్గించడం శని లక్షణ ం. అంతే!

లౌకిక పరిహారం: ధైర్యంతో ఉండేవాళ్లతో కలిసి మెలిసి తిరగండి.
అలౌకిక పరిహారం: బోనాల కాలంలో అమ్మ స్తుతిని చేస్తూ అమ్మకి జలఘటాన్ని సమర్పించుకోండి.

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
శక్తికి మించిన పనుల్లో తలదూర్చాల్సి వస్తుంది. అయినప్పటికీ మీకు దాని వల్ల అపకీర్తి అప్రతిష్టా నిందా రాదు కాబట్టి ధర్మబద్ధంగా సహాయపడాలనే దృష్టితో అలా చేయడం మంచిదే.
సంతానానిక్కావలసిన చదువు వ్యవహారాలకి సొమ్ము బాగా వ్యయమయ్యే పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి శారీరకంగా మరింత శ్రమ చేసి సంపాదించాలనే గట్టి నిర్ణయానికి రండి. పిల్లల్లో కొన్నిటి పట్ల ఆసక్తి ఉంటుంది.

మీ తాత్కాలిక ఆర్థికమాంద్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్లకుండే ఆ చిన్న చిన్న ఆనందాలని కాదనకండి. పదిమంది పిల్లలతోనూ కలిసి వినోదవిహారయాత్రలూ వంటి వాటికి నిరుత్సాహాన్ని చూపకండి.
ఇంట్లో వృద్ధులున్నట్లయితే తేలికపాటి ఆరోగ్యపరీక్షలు తప్పనిసరి అని గ్రహించి చేయించండి. వాళ్లకి తమ సంతానం తమని పట్టించుకుంటున్నారనే ఉత్సాహంతో పాటు అనారోగ్యం పెద్ద గొప్పది కాదనే మనోధైర్యం కలుగుతుంది.

అది అవసరం – అదే అవసరం కూడ ఆ వయసులో.ఏ పరిస్థితుల్లోనూ వాళ్లని వృద్ధాశ్రమంలో చేర్చే ఆలోచనకి రాకండి. వాళ్లు మిమ్మల్నే కనిపెట్టుకుని కళ్లలో పెట్టుకుని ఉండాలనే బలమైన ఆలోచనలో ఉన్నారని గ్రహించుకోండి.చాణక్యుడు రాసిన ప్రకారం వృద్ధాప్యమున్నవారి సూచనలని గ్రహించడం మంచిది తప్ప అదే ప్రకారం నడవడం సరికాదుట. గమనించుకోండి. సోదరసోదరీ సంబంధాలు గట్టిపడతాయి. మీరు కూడ సత్సంబంధాలతోనే ఉంటారు. మొత్తానికి కుటుంబం ఐకమత్యంతో ఉంటుంది.

లౌకిక పరిహారం: కుటుంబ ఐకమత్యానికి ప్రాధాన్యమియ్యండి. మాటలో తొందరతనం వద్దు.
అలౌకిక పరిహారం: బోనాలకాలంలో అమ్మస్తుతి చేస్తూ వేపమండలని సమర్పించుకోండి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top