
శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి అమావాస్య పూర్తి (24గంటలు) నక్షత్రం రేవతి ప.12.44 వరకుతదుపరి, అశ్వని, వర్జ్యం... లేదు దుర్ముహూర్తం ప.11.33 నుంచి 12.22 వరకుఅమృతఘడియలు... ఉ.10.04 నుంచి 11.54 వరకు.
సూర్యోదయం : 5.44
సూర్యాస్తమయం : 6.13
రాహుకాలం : ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు
మేషం: వ్యవహారాలలో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. కొత్త కార్యక్రమాలు చేపడతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి.
వృషభం:కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. రుణయత్నాలు. విద్యార్థులకు నిరాశ. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. ఆలయదర్శనాలు.
మిథునం:పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఒక సమస్య తీరి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం.
కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. వస్తులాభాలు.
సింహం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం. దైవదర్శనాలు. .
కన్య: రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు. రుణయత్నాలు. బంధువులతో వివాదాలు. పనులు మధ్యలో విరమిస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి. విందువినోదాలు.
తుల:ఇంటిలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలకు అనుకూలం. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
వృశ్చికం: మిత్రుల నుంచి శుభవార్తలు. సొమ్ము సకాలంలో అందుతుంది. పనుల్లో విజయం. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహనయోగం. వృత్తి,వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
ధనుస్సు: ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
మకరం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
కుంభం:శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనుల్లో పురోగతి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. .
మీనం: కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. అనారోగ్యం. పనుల్లో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఇంటాబయటా చికాకులు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.