
వైఎస్ఆర్ సీపీ భారీ ర్యాలీ
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా విజయవాడ నగరంలో వైఎస్సార్‌సీపీ నాయకులు భారీ ర్యాలీ తీశారు.
విజయవాడ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా విజయవాడ నగరంలో వైఎస్సార్‌సీపీ నాయకులు భారీ ర్యాలీ తీశారు. గాంధీనగర్ నుంచి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు కొల్లు పార్థసారధి, మేరుగ నాగార్జున, సామినేని ఉదయభాను, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేశ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, దళితులు పాల్గొన్నారు.
ఆర్కే కార్యాలయంలో జయంతి వేడుకలు
గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బడుగు బలహీనవర్గాలకు అంబేద్కర్ చేసిన సేవలను ఎమ్మెల్యే ఆర్కే కొనియాడారు. ఈ వేడుకల్లో స్థానిక వైఎస్సార్‌సీపీ ఎంపీపీ రత్నకుమారి, కన్వీనర్లు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.