'అనంత'లో వైఎస్ఆర్ సీపీ పోరుబాట | Ysrcp porubata in anantapuram district | Sakshi
Sakshi News home page

'అనంత'లో వైఎస్ఆర్ సీపీ పోరుబాట

Nov 5 2014 9:10 AM | Updated on Jul 25 2018 4:09 PM

ఎన్నికల ముందు అరచేతిలో స్వర్గం చూపించి, ఇప్పుడు మొండి చెయ్యి చూపుతున్న చంద్రబాబు నాయుడు వంచక పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది.

అనంతపురం : ఎన్నికల ముందు అరచేతిలో స్వర్గం చూపించి, ఇప్పుడు మొండి చెయ్యి చూపుతున్న చంద్రబాబు నాయుడు వంచక పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది.  రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు, తుపాను బాధితుల సహాయం కోసం ఆంధ్రప్రదేశ్లోని అన్ని మండల కేంద్రాల్లో  వైఎస్ఆర్ సీపీ బుధవారం ధర్నా చేపట్టింది. ఇచ్చిన హామీలపై ఎప్పటికప్పుడు ప్రజలను మోసం చేస్తున్న తీరుపై వైఎస్ఆర్ సీపీ నేతలు ఎండగట్టనున్నారు.

ధర్నా వివరాలు :
*ఉరవకొండ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ధర్నా
* కదిరి ఎమ్మార్వో కార్యాలయం వద్ద వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా ఆధ్వర్యంలో ధర్నా
* అనంతపురం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి,  మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ధర్నా
* రాప్తాడులో వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా
* సింగనమల ఎమ్మార్వో కార్యాలయం వద్ద వైఎస్ఆర్ సీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా
*తాడిపత్రి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వీఆర్ రామిరెడ్డి, రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన
*గుంతకల్లు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా
* కళ్యాణదుర్గం ఆర్డీవో కార్యాలయం ఎదటు వైఎస్ఆర్ సీపీ నేతలు తిప్పేస్వామి ఆధ్వర్యంలో నిరసనలు
*రాయదుర్గంలో వైఎస్ఆర్ సీపీ నేతలు కాపు భారతి, పాటిల్ వేణుగోపాల్ రెడ్డి,  ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా
* పెనుకొండ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు
* హిందుపురం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ సమన్వయ కర్త నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో ధర్నా
*మడకశిర ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త డా.తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే వైటి. ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా
*అగలి ఎమ్మార్వో కార్యాలయం ఎదటు వైఎస్ఆర్ సీపీ నేత గోవర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా
*అమరాపురం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ మాజీ మంత్రి నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా
*పుట్టపర్తి ఎమ్మార్వో కార్యాలయం వద్ద వైఎస్ఆర్ సీపీ నేత సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా
*గోరంట్ల ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా
*ధర్మవరం ఆర్డీవో కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement