పోలీసుల అనుమతితో తండ్రిని కలిసిన అఖిల ప్రియ | ysrcp mla akhila priya meets her father bhuma naagireddy in hospital | Sakshi
Sakshi News home page

పోలీసుల అనుమతితో తండ్రిని కలిసిన అఖిల ప్రియ

Jul 6 2015 11:26 AM | Updated on May 29 2018 4:23 PM

పోలీసుల అనుమతితో తండ్రిని కలిసిన అఖిల ప్రియ - Sakshi

పోలీసుల అనుమతితో తండ్రిని కలిసిన అఖిల ప్రియ

పీఏసీ చైర్మన్, నంద్యాల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఎంఎల్ఏ అఖిల ప్రియ సోమవారం ఆసుపత్రికి వచ్చారు.

కర్నూలు: పీఏసీ చైర్మన్, నంద్యాల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఎమ్మెల్యే అఖిల ప్రియ సోమవారం ఆసుపత్రికి వచ్చారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు అయిన భూమా మధుమేహం, రక్తపోటుతో బాధపడుతూ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల అనుమతితో తండ్రి భూమానాగిరెడ్డిని అఖిల ప్రియ కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో భూమాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.


మెరుగైన చికిత్స కోసం భూమాను తిరుపతి స్విమ్స్‌కుగానీ, హైదరాబాద్‌లోని నిమ్స్ లేక కిమ్స్‌కు తరలించే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ల బృందం వెల్లడించింది. అయితే దీనిపై నేడు(సోమవారం) నిర్ణయం తీసుకోనున్నారు. భూమా ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement