మరుపురాని జ్ఞాపకం!

YSR remembered on birth anniversary - Sakshi

వైఎస్‌ యుగంలో పరుగులు తీసిన జిల్లా అభివృద్ధి

ఆయన మృతితో నత్తనడకన సాగుతున్న వైనం

నేడు దివంగత నేత వైఎస్సార్‌ తొమ్మిదవ వర్ధంతి

సేవా కార్యక్రమాలకు వైఎస్సార్‌ సీపీ సన్నద్ధం

చెరగని చిరునవ్వు...తెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టు.. నడకలో రాజసం.. నమ్ముకున్న వారిని ఆదరించే గుణం... మాట తప్పని మడమ తిప్పని నైజం...కార్మికులు, కర్షకుల కోసం పరితపించే గుణం...ఈ లక్షణాలన్నీ కలగలిపిన మహోన్నత వ్యక్తి.. ఆయనే డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి. అందుకే చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా, అనంతపురం నుంచి అదిలాబాద్‌ వరకూ  వైఎస్‌ఆర్‌ పేరు వినబడితే చాలు మనస్సు పులకిస్తుంది. నేడు మహానేత వైఎస్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

సాక్షి ప్రతినిధి కడప:  రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వైఎస్‌ఆర్‌ ఎంతటి కష్టాన్నైనా భరించారు. ఎలాంటి పన్నులు విధించకుండా ఐదేళ్లు సంక్షేమ పాలన అందించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చిన నాయకుడాయన. అందుకే తెలుగు రాష్ట్రాల ప్రజానీకంతోపాటు ప్రపంచ తెలుగు పజలకు ఆప్తుడయ్యాడు. చెప్పిన మాట ఆచరించేందుకు రచ్చబండ నిర్వహణ కోసం బయలుదేరిన ఆయన 2009 సెప్టెంబరు 2న హెలికాఫ్టర్‌ దుర్ఘటనలో మృత్యువాతపడ్డారు. నేటికీ సరిగ్గా తొమ్మిదేళ్లు పూర్తయినా ప్రజల మదిలో మరుపురాని జ్ఞాపకంగా నిలిచిపోయారు.

ఓటమి ఎరుగని ధీరుడు... దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఓటమి ఎరుగని ధీరుడుగా చరిత్రకెక్కాడు. వైఎస్‌ రాజారెడ్డి, జయమ్మ దంపతుల రెండవ కుమారుడైన ఆయన, విశ్వసనీయతే ప్రామాణికంగా రాజకీయాలు కొనసాగించారు. మాట ఇస్తే ఎంత కష్టమైన నెరవేర్చాలని తపించేవారని విమర్శకులు సైతం కొనియాడుతుంటారు. మెడిసిన్‌ పూర్తి కాగానే జమ్మలమడుగు క్యాంబెల్‌ ఆసుపత్రిలో వైద్యునిగా ఏడాది కాలం సేవలందించారు. ఆ తర్వాత పులివెందులలో తన తండ్రి వైఎస్‌ రాజారెడ్డి పేరున 30 పడకల ఆస్పత్రిని నిర్మించి పేదలకు వైద్య సేవలు అందించారు. అతనికాలంలోనే పేదల డాక్టర్‌గా, రూ.2 వైద్యునిగా గుర్తింపు పొందారు. తండ్రి కోరిక మేరకు 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి జనతా పార్టీ అభ్యర్థి నారాయణరెడ్డిపై 20,496 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆనాటి నుంచి 2009 వరకు ప్రతీ ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నారు. ఓటమెరుగని ధీరుడిగా ఖ్యాతికెక్కారు. 

ప్రజాప్రస్థానంతో పెనుమార్పు...
కరవు బారిన పడిన రాష్ట్ర ప్రజల దరికి చేరేందుకు సీఎల్పీ నేతగా 2003లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠను పెంచారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో సీఎం పదవి వైఎస్‌ను వరిం చింది. ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఉచిత విద్యుత్, పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ బకాయిలు రద్దుపై తొలి, మలి సంతకాలు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ ఒకటేమిటి, అన్ని వర్గాల ప్రజలకు అనువైన సంక్షేమ పథకాలను రూపొందించారు. వాటి అమలులో  పార్టీలకతీతంగా అమలయ్యేలా చిత్తశుద్ధితో కృషి చేశారని ప్రత్యర్థులు సైతం కొనియాడారు. 2009 ఎన్నికల్లో విశ్వసనీయత పేరుతో బరిలో దిగి 156 అసెంబ్లీ స్థానాలను, 33 పార్లమెంటు స్థానాలను గెలిపించడం ఆయన పాలన తీరుకు అద్దం పట్టింది. 

జిల్లా అభివృద్ధిలో ప్రత్యేక ముద్ర
వైఎస్‌ఆర్‌ అధికారంలోకి రాకముందు కడప జిల్లా పాలకుల నిర్లక్ష్యం నీడలో మగ్గుతుండేది. 2004లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధిని జిల్లా నలుమూలల పరుగులు పెట్టించా రు. మునిసిపాలిటీగా ఉన్న కడపను కార్పొరేషన్‌గా, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట మేజర్‌ పంచాయతీలను మున్సిపాలిటీలుగా రూపొందించారు. జిల్లాలో వైవీ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల, పశువైద్య విద్య కళాశాలను నెలకొల్పా రు. జిల్లా కేంద్రంలో రిమ్స్‌ వైద్య కళాశాల, 750 పడకల  రిమ్స్‌ ఆస్పత్రి, దంత వైద్యశాల నిర్మించారు. అలాగే ట్రిపుల్‌ ఐటీ, ఐజీ కార్ల్‌ పశు పరిశోధన కేంద్రంతో పాటు ఎన్నో పరిశ్రమలను నెలకొల్పారు. బ్రహ్మణీ స్టీల్స్‌ కర్మాగారంతోపాటు పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను పరుగులు పెట్టించారు.

 ఎన్నికల సమయంలో మాత్రమే శంకుస్థాపనలు చేసే టీడీపీ నాయకులకు కనువిప్పు కలిగించారు. జలయజ్ఞంలో భాగంగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు వందల కోట్లు ఖర్చు చేశారు. గాలేరు–నగరి సుజల స్రవంతి, గండికోట కెనాల్, టన్నెల్, గండికోట వరద కాల్వ, గండికోట ఎత్తిపోతల పథకాలను వైఎస్సార్‌ హయాంలో రూపొందిం చినవే. మైలవరం ఆధునికీకరణ, సర్వరాయసాగర్, వామి కొండ ప్రాజెక్టు, సీబీఆర్, పీబీసీ, పైడిపాళెం, వెలిగల్లు, తెలుగుగంగ ప్రాజెక్టు పనులు చకచకా సాగించారు. జిల్లాకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ  జిల్లా వాసులు వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా విస్తృతంగా సేవా కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమయ్యా రు. రక్తదానం, అన్నదానం, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సమాయత్తమయ్యారు.  

కొనసాగుతున్న ‘చంద్ర’ గ్రహణం
శరవేగంగా సాగిన జిల్లా అభివృద్ధి తుదిదశకు చేరే సమయంలో వైఎస్‌ఆర్‌ మరణంతో కుంటుబడింది. తొమ్మిదేళ్లు గడిచినా ఇంకా పెండింగ్‌ పథకాలుగా దర్శనమిస్తున్నాయి. సోమశిల వెను క జలాలను యోగి వేమన యూనివర్శిటీ, ఏపీఐఐసీ పార్కుకు ఇప్పించే యత్నాన్ని వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టారు. రూ. 430 కోట్లతో చేపట్టన ఆ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయా యి. రాజకీయ కారణాలతో బ్రహ్మణీ స్టీల్స్‌ను ఏకంగా రద్దు చేశారు. అంతర్జాతీయ పశు పరిశోధనలు కలగానే మిగిలాయి. జిల్లాకు చంద్రగ్రహణం ఆవహించి పట్టి పీడిస్తోంది. రాష్ట్ర విభజన నేప«థ్యంలో వైఎస్సార్‌ జిల్లాను పూర్తిగా విస్మరిస్తున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మౌళిక వసతులున్నప్పటికీ పారిశ్రామిక వృద్ధి సాధించకుండా జిల్లాపై వివక్షత చూపుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top