సరికొత్త చరిత్రను సృష్టించిన మహానీయుడు వైఎస్సార్‌

YSR Death Anniversary In East Godavari - Sakshi

సరికొత్త చరిత్రను సృష్టించిన మహానీయుడు వైఎస్సార్‌

వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి

తూర్పు గోదావరి, మధురపూడి (రాజానగరం): రాజకీయాల్లో దివంగత మహానీయుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి  సరికొత్త చరిత్రను సృష్టించి, రాజనీతిజ్ఞుడుగా నిలిచారని వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా కోరుకొండ మండలం బుచ్చెంపేటలో జరిగిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీస్తు పూర్వం, క్రీస్తుశకం తరహాలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి పూర్వం, తర్వాత అనిమాట్లాడుకొనే పరిస్థితి ఏర్పడిందన్నారు. వైఎస్‌ను ప్రతిఒక్కరూ వారి గుండెల్లో గుడి కట్టుకుని పూజిస్తున్నారన్నారు. తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా మార్చడంలో ఆయన కృషి ఎనలేనిదన్నారు. నూతన రాజకీయాలకు రాజన్న దిక్చూచిగా నిలిచిపోతారన్నారు. రాజన్నబాటలోనే జగన్‌ నడుస్తున్నారన్నారు. అంతకు ముందు వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాపవరం పార్టీ కార్యాలయంలో, మండలంలోని ప లు ప్రాంతాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. కార్య క్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ వుల్లి బుజ్జిబాబు, పార్టీ నాయకులు నక్కా రాంబాబు, అడబాల సీతారామకృష్ణ, చింతపల్లి చంద్రం, అయిల రామకృష్ణ, బొరుసు బధ్రి, సలాది వెంకటేశ్వరరావు, తాడి హరిశ్చంద్రప్రసాద్‌ రెడ్డి, కాలచర్ల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

ముందుచూపున్న మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌
రామచంద్రపురం: రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఉండాలని ప్రజల కష్టాలను ముందుగానే తెలుసుకునే మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్‌ సీపీ అమలాపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా గల మహానేత విగ్రహానికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, జెడ్పీ మాజీ చైర్మన్‌ చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ నేతృత్వంలో వైఎస్సార్‌ తొమ్మిదో వర్ధంతిని నిర్వహించారు. వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఎమ్మెల్సీ బోస్‌ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి ఆయన చేసిన సేవ మరువలేనిదన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ఆయన పరిపాలన సాగించి రాష్ట్ర ప్రజల గుండెల్లో నేటికీ చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్సార్‌ అని ఆయన కొనియాడారు. రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యదర్శి మాగాపు అమ్మిరాజు, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి సత్తిశంకర్‌రెడ్డి,  పార్టీ నాయకులు చింతారామ్మోహన్‌రెడ్డి, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top