
రాజధానిపై ప్రకటనకు ముందే సభలో చర్చించాలి
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రకటనకు ముందే అసెంబ్లీలో చర్చించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం వాయిదా తీర్మానం ఇచ్చింది.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రకటనకు ముందే అసెంబ్లీలో చర్చించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం వాయిదా తీర్మానం ఇచ్చింది. రాజధాని అంశంపై రూల్ 53 కింద ఆ పార్టీ నోటీసు ఇచ్చింది. ఏపీ రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీలో ప్రకటన చేయనున్న విషయం తెలిసిందే. కాగా రాజధాని ఎక్కడైనా తమకు ఓకే అని, అయితే చర్చ జరగకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటుందని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.