వైఎస్సార్ సీపీ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా | ysr congress party moves to high court for samaikya sankharavam | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా

Oct 13 2013 7:06 PM | Updated on Aug 31 2018 8:24 PM

‘సమైక్య శంఖారావం’ పేరుతో ఈ నెల 19న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది.

హైదరాబాద్: ‘సమైక్య శంఖారావం’ పేరుతో ఈ నెల 19న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

శాంతిభద్రతల సమస్య అంటూ కుంటి సాకులు చూపుతూ హైదరాబాద్‌లో సమైక్య సభకు అనుమతిచ్చేది లేదని స్పష్టం చేసింది. హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి ఈ మేరకు శనివారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సమాచారం అందించారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ తలపెట్టిన సభకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు ఇచ్చిన ఆర్డర్ చూస్తే ఇది పోలీస్ ఆర్డరా లేక పొలిటికల్ (రాజకీయ) ఆర్డరా? అన్న సందేహం కలుగుతోందని వ్యాఖ్యానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement