వైఎస్ జయంతి వేడుకలు విజయవంతం చేయండి | YS Jayanthi celebrations to succeed | Sakshi
Sakshi News home page

వైఎస్ జయంతి వేడుకలు విజయవంతం చేయండి

Jul 5 2015 11:27 PM | Updated on Aug 17 2018 8:06 PM

వైఎస్ జయంతి వేడుకలు విజయవంతం చేయండి - Sakshi

వైఎస్ జయంతి వేడుకలు విజయవంతం చేయండి

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా

పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ పిలుపు
 

అల్లిపురం : దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం పార్టీ మహిళా కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ సోమవారం నగరంలోని డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో నిర్వహించే వ్యాసరచన పోటీలతో పాటు, 7వ తేదీన విశాఖ ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా గల వైఎస్‌ఆర్ పార్కు వద్ద జరిగే రంగవల్లుల పోటీల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనే విధంగా కృషి చేయాలని కోరారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో మహిళలకు పెద్ద పీట వేశారన్నారు.

ఆరుగురు మహిళలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించి మహిళ పట్ల ఆయనకు గల అభిమానాన్ని చాటుకున్నారన్నారు. అదే విధంగా మహిళలకు డ్వాక్రా రుణాలు, పావలా వడ్డీలు, ఆరోగ్య శ్రీ వంటి పథకాలను అందజేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. సమావేశంలో నగర మహిళా విభాగం అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, శ్రీదేవీ వర్మ, మేరుగుమాల శ్రీదేవి, శశికళ, కారి శ్రీలక్ష్మీ, అనురాధ, యువశ్రీ, అమ్మాజీ, వార్డు మహిళా కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement