ప్రధాని మోదీని కలవనున్న వైఎస్ జగన్

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలవనున్నారు. పార్టీ ఎంపీలతో కలిసి ఆయన రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రధానితో సమావేశమవుతారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావలసిన నిధుల అంశాలను నివేదిస్తారు.
విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ అంశాలపై ప్రధాని మోదీతో వైఎస్ జగన్ చర్చిస్తారు.