అదే నా సంకల్పం: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy Diwali Greetings For The Telugu People | Sakshi
Sakshi News home page

తెలుగువారందరికీ వైఎస్‌ జగన్‌ దీపావళి శుభాకాంక్షలు

Nov 5 2018 5:07 PM | Updated on Nov 6 2018 8:18 AM

YS Jagan Mohan Reddy Diwali Greetings For The Telugu People - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలిగించాలన్నదే తన సంకల్పం, తపన అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పే ర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశా రు. ‘‘గాయం నుంచి నేను కోలుకుంటున్నాను. మీ అందరి తోడుగా, మీ ఆత్మీయతల మధ్య అతి త్వరలో తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తాను. ప్రజల అభిమానం, దేవుడి ఆశీస్సులతో ఏడాది కాలంగా ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో నాకు మద్దతు పలికిన ప్రతి హృదయానికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను.’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.  

చెడు మీద విజయానికి దీపావళి ప్రతీక
దీపావళి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందాల కాంతులు నింపాలని వైఎస్‌ జగన్‌ అభిలషించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement