
హైదరాబాద్ బయల్దేరిన వైఎస్ జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తన చెన్నై పర్యటన విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు.
చెన్నై: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తన చెన్నై పర్యటన విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు. సమైక్యాంధ్రకు మద్దతు కూడగట్టేందుకు జాతీయ, ప్రాంతాయ పార్టీల నేతలను కలుస్తున్నదానిలో భాగంగా అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధిలను కలిసేందుకు ఆయన నిన్న చెన్నై వెళ్లిన విషయం తెలిసిందే.
రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వారికి వివరించి, సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని జగన్ వారిని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 సవరణకు కృషిచేయాలని, విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటులో గొంతెత్తాలని వారికి విజ్ఞప్తి చేశారు.