మండలంలోని డాకూర్ గ్రామ శివారులోని సాకి చెరువులో ఓ యువకుడి మృతదేహం అనుమానాస్పద స్థితిలో శుక్రవారం బయటపడింది.
జోగిపేట, న్యూస్‌లైన్ : మండలంలోని డాకూర్ గ్రామ శివారులోని సాకి చెరువులో ఓ యువకుడి మృతదేహం అనుమానాస్పద స్థితిలో శుక్రవారం బయటపడింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. జోగిపేట మండలం డాకూర్‌కు చెందిన రంగంపేట రమేష్ కొన్నే ళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం భా ర్యతో కలిసి సంగారెడ్డికి వలస వె ళ్లాడు. అక్కడి కల్లు డిపోలో కూలీగా పనిచేస్తున్నాడు. అయితే ఏమి జరిగిం దో ఏమో కాని డాకూర్ గ్రామ శివారులోని సాకి చెరువులో శుక్రవారం శ వమై తేలాడు. గ్రామస్తుల సమాచారం మేరకు.. జోగిపేట ఎస్‌ఐ - 2 అశోక్‌తో పాటు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చె రువు నుంచి ఒడ్డుకు చేర్చారు.
అయితే మృతుడి ముఖంపై యాసిడ్ లేదా పెట్రోల్ పోసి తగల బెట్టారు. దీంతో ముఖం గుర్తు పట్టలేని విధంగా ఉంది. గొంతు వద్ద గాయాలు ఉన్నాయి. ఎవరో చంపి చెరువులో పడేసినట్లు తెలుస్తోంది. ఆధారాల కోసం మృతుడి ప్యాంట్ జేబును పరిశీలించగా ఓటరు గుర్తింపు కార్డు, ఫొటోలు లభించాయి. దీంతో మృతుడు డాకూ ర్ గ్రామానికి చెందిన రంగంపేట రమేష్ (27)గా గుర్తిం చారు. సంఘటనా స్థలానికి సీఐ సైదానాయక్ చేరుకుని స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఏ శంకరయ్య, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ టీ శ్రీనివాస్, నాయకులు మధుసూదన్‌రెడ్డి, భూమ య్య, ఎల్లయ్యలతో మాట్లాడి మృతు డి వివరాలను సేకరించారు. ఇదిలా ఉండగా.. మృతుడి మాత్రం తన కుమారుడిని హత్య చేసి చెరువులో పడేశారని ఆరోపించారు. పోలీసులు విచారణ జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అశోక్ తెలిపారు.