యువతి కిడ్నాప్కు విఫలయత్నం | Young Girl saved her life in abduction attempt in vishakapatnam district | Sakshi
Sakshi News home page

యువతి కిడ్నాప్కు విఫలయత్నం

Apr 19 2015 10:41 AM | Updated on Aug 1 2018 2:29 PM

విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టు మండలం సొన్న గ్రామంలో యువతి కిడ్నాప్కు దుండగుడు విఫల యత్నం చేశాడు.

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టు మండలం సొన్న గ్రామంలో యువతి కిడ్నాప్కు దుండగుడు విఫల యత్నం చేశాడు. మంచినీటి కోసం బయటికి వచ్చిన గౌరమ్మ అనే యువతి పై మత్తు మందు చల్లి కిడ్నాప్కు యత్నించాడు. మహిళలు అడ్డుకోవడంతో ఆగంతకుడు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. యువతిని అక్కడే విడిచి పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇదాలా ఉండగా గత నెలరోజులుగా గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement