పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం: వైఎస్ విజయమ్మ | Y S Vijayamma gives to report over corp damage | Sakshi
Sakshi News home page

పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం: వైఎస్ విజయమ్మ

Oct 30 2013 2:27 PM | Updated on Sep 2 2017 12:08 AM

భారీ వర్షాల కారణంగా పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వెల్లడించారు.

భారీ వర్షాల కారణంగా పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వెల్లడించారు. బుధవారం వైఎస్ విజయమ్మ  విజయనగరం జిల్లాలో ముంపునకు గురైన పూసపాటిరేగ మండలం కొవ్వాడ, భోగాపురం తదితర ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆమె పరామర్శించారు. ఈ సందర్బంగా ఆమె మట్లాడుతూ...   పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారంతో పాటు..ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇవ్వాలి ఆమె డిమాండ్ చేశారు.

 

రైతుల తరపున అసెంబ్లీలో పోరాడతామన్నారు. అలాగే రైతులందరు ధైర్యంగా ఉండాలని వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తిని సంగతిని ఈ సందర్బంగా వైఎస్ విజయమ్మ రైతులకు వెల్లడించారు. కోర్టు అనుమతిస్తే వైఎస్ జగన్ నేరుగా వచ్చి రైతులను పరామర్శిస్తారని ఆమె తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో భారీ వర్షాల కారణంగా నిరాశ్రయులైన వారందరికి పక్కా ఇళ్లు కట్టిస్తారని ఆమె బాధితులకు భరోసా ఇచ్చారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల కోసం నిరంతరం శ్రమించారని వైఎస్ విజయమ్మ ఈ సందర్బంగా గుర్తు చేశారు.వైఎస్ జగన్ కూడా ఆ మహానేత మార్గంలోనే నడిచి ఆయన స్వప్నాలను సాకారం చేస్తారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement