దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 5వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి.
సాక్షి, నెల్లూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 5వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి.
పార్టీ శ్రేణులు వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకాలతో పాటు పూలమాలలు వేసి నివాళులర్పించడం, అన్నదానాలు, ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ, రక్తదానం తదితర సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. గ్రామ గ్రామాన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.