మన జిల్లాకు మరో విశ్వవిద్యాలయం మంజూరు కానుంది. అదికూడా కేంద్రీయ విశ్వవిద్యాలయం కావడం విశేషం. తాడేపల్లిగూడెం సమీపంలోని
‘పశ్చిమ’ సిగలో మరో ‘వర్శిటీ’
Jan 3 2014 3:54 AM | Updated on Aug 20 2018 9:16 PM
తణుకు టౌన్, న్యూస్‌లైన్ :మన జిల్లాకు మరో విశ్వవిద్యాలయం మంజూరు కానుంది. అదికూడా కేంద్రీయ విశ్వవిద్యాలయం కావడం విశేషం. తాడేపల్లిగూడెం సమీపంలోని వెంకట్రామన్నగూడెంలో ఇప్పటికే డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంబంధిత కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చిం ది. ఇతర కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా మరో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యూయి.
6 కళాశాలల నుంచి ప్రతిపాదనలు
దేశంలో ఈ ఏడాది కొత్తగా 45 కేంద్రీయ విశ్వవిద్యాలయూలను ఏర్పాటు చేయూలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇందుకోసం కొత్తగా రాష్ట్రీయ ఉచత్తర్ శిక్షాభియాన్ (రూసా) పథకం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో 7 జిల్లాల్లో కొత్తగా కేంద్రీయ విశ్వవిద్యాలయూలను ఏర్పాటు చేయూలని నిర్ణయించారు. వాటిలో ఒకటి మన జిల్లాలో ఏర్పాటు కానుంది. విశ్వవిద్యాలయం కోసం తణుకులోని చిట్టూరి ఇంద్రయ్య స్మారక డిగ్రీ కళాశాలతోపాటు భీమవరంలోని డీఎన్నార్, కేజీఆర్ కళాశాలలు, ఏలూరు సీఆర్‌ఆర్, సెయింట్ థెరిస్సా కళాశాలలు, నరసాపురంలోని వైఎన్ కళాశాల ఉన్నత విద్యామండలి ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిం చాయి. ఏలూరు, భీమవరం, నరసాపురంలోని కళాశాలలు అటానమస్, ఎయిడెడ్ హోదాతో ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో పారిశ్రామికంగా ముందంజలో ఉన్న తణుకు పట్టణంలోని చిట్టూరి ఇంద్రయ్య స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేయూలనే వాదన తెరపైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న కళాశాల ఇదొక్కటి మాత్రమే. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తణుకులోనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. 1968లో చిట్టూరి ఇంద్రయ్య కళాశాల ఏర్పాటు కాగా, సోమేశ్వర స్వామి ఆలయ భూమిని 40 ఏళ్ల లీజు ప్రాతిపదికన తీసుకుని కళాశాలను నెలకొల్పారు. ప్రస్తుతం ఇక్కడ 10 డిగ్రీ కోర్సులు, రెండు పీజీ కోర్సులున్నాయి. ఈ కళాశాల జిల్లాలోని డిగ్రీ కళాశాలలకు వనరుల కేంద్రంగా వ్యవహరిస్తోంది. డిగ్రీ కళాశాలలకు అకడమిక్ అడ్వైజర్‌గా, జిల్లా కల్చరల్ విభాగం కో-ఆర్డినేటర్ గా, జిల్లా రెడ్ రిబ్బన్ క్లబ్ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తోంది.
తాడేపల్లిగూడెంకు అవకాశం !
విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తాడేపల్లిగూడెంలో అనువైన పరిస్థితులు ఉన్నాయనే వాదన కూడా తెరపైకి వచ్చింది. తాడేపల్లిగూడెంలో ఆంధ్రా విశ్వవిద్యాలయ అనుబంధ క్యాంపస్‌లో భూమి, సౌకర్యాలు అందుబాటులో ఉన్నందున కొత్తగా మంజూరయ్యే విశ్వవిద్యాల యూన్ని ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
భిన్నాభిప్రాయూలు
యూనివర్శిటీ ఏర్పాటుకు ఏలూరు సీఆర్‌ఆర్ అటానమస్, సెయింట్ థెరిస్సా అటానమస్ మహిళా కళాశాల, భీమవరంలోని డీఎన్‌ఆర్, నరసాపురంలోని వైఎన్ కళాశాలల నుంచి ఉన్నత విద్యామండలికి నేరుగా దరఖాస్తులు వెళ్లాయి. భీమవరంలోని 5, 6 కళాశాలలను క్లస్టర్‌గా చేసుకుని కేజీఆర్ కళాశాలలో యూనివర్శిటీ ఏర్పాటు చేయూలనే ప్రతిపాదన కూడా వచ్చింది. ఇదే సందర్భంలో తణుకులోని చిట్టూరి ఇంద్రయ్య స్మారక డిగ్రీ కళాశాలకు స్టేట్ యూని వర్శిటీగా వర్గోన్నతి కల్పించాలనే ప్రతిపాదన సైతం వెళ్లింది.
ఇవీ అర్హతలు...
ఏదైనా కళాశాలను విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలంటే... ఆ కళాశాలలో విధిగా డిగ్రీ కోర్సులు ఉండాలి. దానికి అటానమస్ స్టేటస్, 25 ఎకరాల భూమి, నాక్ ‘ఏ’ గ్రేడ్, సీఎఫ్‌పీడబ్ల్యుఈ (సెంటర్ ఫర్ పొటెన్షియూలిటీ విత్ ఎక్స్‌లెన్సీ), కనీసం 2,700 మంది విద్యార్థులు, యూజీ, పీజీ కోర్సులలో ఏదో ఒకదానిలో కో-ఎడ్యుకేషన్ వంటి అర్హతలు అవసరం.
ప్రతిపాదనలు పంపించాం
యూనివర్శిటీ ఏర్పాటు కోసం తణుకులోని చిట్టూరి ఇంద్రయ్య స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి డిసెంబర్ 24న రూసా కమిటీకి ప్రతిపాదనలు అందజేసినట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంఎస్ ప్రసాద్ తెలిపారు. అవసరమైన అన్ని అవసరాలకు సంబంధించిన వివరాలను పంపించామన్నారు. నిబంధనల ప్రకారం తణుకు కళాశాలకే యూనివర్శిటీ మంజూరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Advertisement