హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలి | we need 10 districts of telangana mandatory | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలి

Sep 13 2013 1:03 AM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రం తప్పా ఇతర ప్రత్యామ్నాయాలకు ఒప్పుకునే ప్రసక్తే లేదని తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొంతం మాధవరెడ్డి పేర్కొన్నారు.


 ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రం తప్పా ఇతర ప్రత్యామ్నాయాలకు ఒప్పుకునే ప్రసక్తే లేదని తెలంగాణ  కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొంతం మాధవరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఇబ్రహీంపట్నంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాధన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే తాము కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.
 
  హైదరాబాద్ ఇవ్వకుండా ఎలాంటి ప్యాకేజీలు, హామీలకు తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని అన్నారు. గత జూలై 30 ప్రకటన మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమానికి తెరలేపారని ఆరోపించారు. విభజన ప్రకటన వెలువడిన అనంతరం కూడా సీమాంధ్రులు గొడవ చేయడం సమంజసం కాదన్నారు. సమావేశంలో ఎంటీసీపీ నాయకులు కె. శేఖర్, జె. వెంకటేశ్, ఎన్. ఉమాదేవి, జె. రమాదేవి, జి. శ్రీనివాస్, వి. నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement